RBI Move to plug the persisting Cash Crunch

Printing of rs 200 currency notes begins

Demonetisation, Demonetisation RBI, Reserve Bank of India News, 200 Notes, 200 New Notes, Indian New Currency,

More Than Seven Months After Demonetisation, The RBI Has Started Printing ₹200 Notes.

ఏడు నెలల తర్వాత కష్టాలకు చెక్

Posted: 06/29/2017 08:31 AM IST
Printing of rs 200 currency notes begins

నోట్ల రద్దు తర్వాత దాదాపు ఏడు నెలలపాటు చిల్లర కష్టాలు అనుభవిస్తున్న ప్రజల కోసం స్వీట్ న్యూస్. చిన్న నోట్ల ముద్రణ ప్రారంభించేసిటన్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించేసింది. నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దు వాటి స్థానే 2000, 500 కొత్త నోట్లు రావటం, ఆపై క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ల పేరిట చిన్న నోట్ల ముద్రణ ఆపేయటంతో కార్డుల ద్వారా లావాదేవీలు జరపలేక జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు.

ఇది చాలదన్నట్లు ఎలాంటి లావాదేవీలకైనా ఛార్జీల పేరిట బ్యాంకులు మోత మోగించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరెన్సీ కరువై తీవ్ర కష్టాలు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్యలకు పుల్ స్టాప్ పెట్టేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. 200 నోటుతోపాటు కొత్త వంద నోటు ముద్రణ అనుమతుల కోసం ఆ మధ్యే ఆర్థిక శాఖ ముందు ప్రతిపాదన తీసుకెళ్లింది. చర్చోపచర్చలనంతరం ఎట్టకేలకు ఫైనాన్స్ శాఖ ఆర్బీఐకు గ్రీన్ సింగ్నల్ ఇచ్చింది.

ఈ క్రమంలో రూ.200 నోట్ల ముద్రణ జోరుగా సాగుతున్నట్టు స్వయంగా ఆర్బీఐ తెలిపింది. కొన్ని వారాల క్రితమే ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్‌లో వీటి ముద్రణ ప్రారంభమైనట్టు ఓ అధికారి వెల్లడించాడు. హై సెక్యూరిటీ ఫీచర్లతో ఇవి ఉండబోతున్నాయంట. ఈ నోట్లు గనుక త్వరలో వాడుకలోకి వస్తే మాత్రం జేబులో డబ్బులున్నా(పెద్ద నోటు) ఖర్చు పెట్టలేని పరిస్థితి నుంచి బయటపడొచ్చు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetisation  200 Notes  New Currency  

Other Articles