Shrestha Thakur bullying by BJP workers transferred లేడీ సింగం అధికారిపై బదిలీ వేటు..

Up woman cop who stood up to bullying by bjp workers transferred

UP, Bulandshahr, BJP, Bullying, Yogi Adityanath, Police, Uttar Pradesh, Woman Cop, Senior woman officer, Shrestha Thakur, BJP workers, lady Circle Officer, BJP leader, Pramod Lodhi, Bulandshahr, lady singham, vehicle check, challans, Singham, cctv, dabbang mahila, viral video

Shrestha Thakur, a woman senior police officer has been transferred to Bhairach from Bulandshahr as she stood up to BJP workers and arrested five of them for bullying.

లేడీ సింగం అధికారిపై బదిలీ వేటు.. యోగీ సర్కారుదీ పాత తీరు..!

Posted: 07/02/2017 04:08 PM IST
Up woman cop who stood up to bullying by bjp workers transferred

చట్టం నాకు చుట్టం అనే అధికార పక్షానికి ఎదురొడ్డి గట్టిగా బదులిచ్చిన లేడీ అఫీసర్ గుర్తున్నారా..? నెటజనుల ప్రశంసలు పొందిన ఈ లేడీ సింగం, దబాంగ్ లేడీ పోలీస్ అఫీసర్ శ్రేష్ట ఠాకూర్ పట్ల ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ హోం శాఖ సర్వసాధరణంగానే వేటు వేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కన్నా అధికంగా హైప్ వున్న ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం అందరి అంచనాలకు భిన్నంగా స్పందిస్తుందని భావించిన నేపథ్యంలో కొంత అలస్యంగా స్పందించిన సర్కార్.. సిఐ శ్రేష్టా ఠాకూర్ పై బదిలీ వేటు వేసింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో బులంద్‌షహర్‌ స్యానా సర్కిల్‌ ఆఫీసర్ శ్రేష్ఠా ఠాకూర్‌ గత వారం రోజుల క్రితం.. మోటారుబైకుపై హెల్మట్ లేకుండా వెళ్తున్న ఓ వ్యక్తిని హెల్మెట్ లేకుండా వెళ్తున్నారేంటని అపింది, అతను అధికార పక్షానికి చెందిన వాడు కావడంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో అతన్ని ఆపి లైసెన్స్‌ అడిగింది. అతని దగ్గర లేదు. దీంతో అతనికి రెండు వేల రూపాయల జరిమానా విధించింది. అప్పటికీ వెనక్కు తగ్గని సదరు కార్యకర్తు గర్వంతో విర్రవీగసాగాడు.

సీఐతో ఉన్న కానిస్టేబుల్‌పై పెద్ద ఎత్తున అరవడం మొదలుపెట్టాడు. అతను మాటలు ఆపకముందే అరెస్టుచేసి.. వూచలు లెక్కపెట్టించింది. అధికార పక్షానికి చెందిన ఓ కార్యకర్త కోసం ఏకంగా ఎమ్మెల్యే భర్త వచ్చి.. అమెను నిలదీశారు. అయినా  అమె ఏమాత్రం బెదరకుండా సమాధానం చెప్పడంతో వెనుదిరిగి వెళ్లారు. ఈ వీడియోలు అప్పట్లో నెట్ లో వైరల్ గా మారాయి. తాజాగా బులంద్ షెహర్ లోని స్యానా సర్కిల్ లో విధులు నిర్వహిస్తున్న ఆమెని బహ్రైచ్ కి బదిలీ చేశారు.

ఇటీవల స్థానిక భాజపా నేతలు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేకుండా పట్టుబడడంతో వారికి జరిమానా విధించారు. దాంతో నేతలు ఆందోళనకు దిగారు. అప్పుడు శ్రేష్ఠా వారికి దీటుగా సమాధానం చెప్పి ఆందోళన చేసినవారిలో ఐదుగురిని జైలుకు పంపింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో అందరూ ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. కానీ ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆమె బదిలీ అవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shrestha Thakur  BJP workers  Bulandshahr  BJP  Yogi Adityanath  Uttar Pradesh  

Other Articles