తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఒడిషా ఇటు ఛత్తీస్ గడ్ వరకు తన నేర సామ్రాజ్యాన్ని స్థాపించిన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'ఖయ్యూం భాయ్' సినిమాను ఈ శుక్రవారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రంలో నయీం పాత్ర పోషించిన నటుడు హీరో కట్టా రాంబాబుకు కానీ, లేదా చిత్ర దర్శకుడు భరత్ పారేపల్లి కానీ ఊహించని విధంగా చిత్రంలో రూపొందించిన సన్నివేశాన్ని వారు స్వతహాగా అనుభవించారు.
అదేంటి అంటారా..? గ్యాంగ్ స్టర్ నయీం అనేక మందిని కిడ్నాప్ చేసి తన చెరలో బంధించుకున్నారన్న వార్తలు వెలుగుచూసిన నేపథ్యంలో అదే తరహాలో చిత్ర హీరో రాంబాబు, దర్శకుడు భరత్ లను కొందరు అగంతకులు కిడ్నాప్ చేశారు. వీరిద్దరూ కలసి ప్రయాణిస్తున్న కారును కొందరు దుండగులు అడ్డుకున్నారు. వారిని బెదిరించిన అగంతకులు వారిని తమ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.
హీరో దర్శకులు అగంతకులు ఏకంగా అనంతపురం తీసుకెళ్లి, అక్కడ ఓ హోటల్ లో వారిని నిర్భంధించారు. తమకు తక్షణం 10 కోట్ల రూపాయలు ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు. అయితే రాంబాబు, భరత్ ల ఫోన్ సిగ్నల్స్ తో వారెక్కడున్నారన్న సమాచారాన్ని పోలీసులు కనుగొన్నారని సమాచారం అందుకున్న అగంతకులు వారిని అక్కడే వదిలేసి పరరయ్యారు. ఈ రోజు సాయంత్రం వారు హైదరాబాదు చేరుకోనున్నారు. అయితే వారిని ఎవరు కిడ్నాప్ చేసిందన్న విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more