Triple car bombs rock Damascus killed 21

21 killed as car bomb blasts rock damascus

Syria Capital Damascus, Car Bomb Attack, Car Bomb Suicide Attack, Al-Qaeda Syria, Triple Car Bombs, Syria Suicide Attack, Syria Capital Damascus Terror Attacks

Suicide attacker kills at least 21 in Syria Capital Damascus. Dozens of casualties reported Al-Qaeda claims responsibility.

సైన్యం రౌండప్.. 21 మంది మృతి

Posted: 07/03/2017 08:49 AM IST
21 killed as car bomb blasts rock damascus

వరుస ఉగ్రదాడులతో సిరియా వణికిపోతుంది. తాజాగా రాజధాని డమాస్కస్ ఆత్మాహుతి దాడితో దద్ధరిల్లింది. ఆదివారం మధ్యాహ్నాం పక్క సమాచారంతో వీధుల్లో సంచరిస్తున్న ఓ టెర్రరిస్ట్ ను సైన్యం చుట్టుముట్టుంది. దీంతో ఆ ఉగ్రవాది తనకు తానుగా పేల్చేసుకున్నాడు. దాడిలో ఇప్పటిదాకా 21 మంది మృతి చెందినట్లు సమాచారం.

అధ్యక్షుడు బషర్ అల్ అసద్, సైన్యం కు మధ్య పొరపచ్చాలు రావటంతో భద్రతా కట్టుదిట్టంగా కనిపించటం లేదు. దీంతో ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు ముఖ్య పట్టణాలపై దాడులకు
తెగబడుతున్నారు. ఈ క్రమంలో నగర శివార్లలో భద్రతా దళాలు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ ఉగ్రవాదిని గుర్తించారు. మొత్తం 8 మంది చనిపోగా 13 మంది తీవ్రంగా గాయపడినట్టు సిరియా అధికారిక టెలివిజన్ పేర్కొనగా, సిరియా మానవ హక్కుల సంఘం మాత్రం 21 మంది చనిపోయినట్టు పేర్కొంది. ఇందులో బ్రిటన్ నుంచి సిరియాలో పని చేస్తున్న హ్యుమన్ రైట్స్ ప్రెసిడెంట్ కూడా ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. ఇటీవల ఇక్కడ జరిగిన పేలుళ్లకు అల్ ఖైదా బాధ్యత వహించటంతో ఇది కూడా వారి పనే అని అనుమానిస్తున్నారు. మరోపక్క రష్యా సైన్యాలు ఉగ్ర శిబిరాలను గుర్తించటంలో విఫలమవుతుండటంతో సాధారణ ప్రజలపై బాంబుల వర్షం కురుస్తుంది. ఏళ్ల తరబడి జరుగుతున్న ఈ అంతర్యుద్ధంలో 22 మిలియన్ల ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయినట్లు ఓ అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Syria  Damascus  Car Bomb Attack  21 Killed  

Other Articles