Owaisi Brothers bumper offer to rivals

Akbaruddin owaisi prediction on 2019 elections

Akbaruddin Owaisi, Akbaruddin Owaisi 2019 Elections, Akbaruddin Owaisi Rivals, Akbaruddin Owaisi Modi, Akbaruddin MIM, AIMIM 2019 Elections, Akbaruddin 50 to 90 Seats

Akbaruddin Owaisi Angry Reaction On Bjp PM Narender Modi SArkar 3 Year Work. Ask rivals to join with them. After Akbaruddin Owaisi Publicly Invites Mohd Ghouse & MBT Ready To Join AIMIM Party. Junior Owaisi Confident 50 to 90 seats in 2019 Elections.

మజ్లిస్ విజృంభణ .. అక్బర్ అత్యాశేనా?

Posted: 07/03/2017 12:25 PM IST
Akbaruddin owaisi prediction on 2019 elections

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించినప్పటికీ అరకొర సీట్లు తప్ప మజ్లిస్ పార్టీకి ఒరిగిందేం లేదనే చెప్పాలి. అయితే ఆయా ప్రాంతాల్లో తమ పార్టీ బీజాలు నాటుకునేందుకు మాత్రం ఒవైసీ బ్రదర్స్ బాగానే కృషి చేస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, యూపీ ఇలా కీలక రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్ర స్థాయి నుంచే కదులుతున్నారు. ఇందుకోసం బద్ధ శత్రువులుగా ఉన్న ఎంబీటీ లాంటి పార్టీలకు కూడా బంపరాఫర్ ప్రకటించేశాడు.

2019 ఎన్నికల్లో మజ్లిస్ కు 50 నుంచి 90 పార్లమెంటు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్నాడు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. మజ్లిస్‌ చీఫ్ సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ తొమ్మిదో వర్ధంతి సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో అక్బర్ ప్రసంగిస్తూ... గెలుపు కోసం దేశంలోని ముస్లింలంతా ఏకం కావాలని పిలుపునిచ్చాడు. ఆరేళ్ల క్రితమే తాను చావును జయించానని, తనకు ఎవరిపైనా కక్ష లేదని ఆయన తెలిపాడు. ముస్లింలకు సేవ చేసేందుకు ముందుకొచ్చే వారు ప్రత్యర్థులైనా సరే కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తన కుర్చీని సైతం అప్పగించి వారి కింద పనిచేస్తానని స్పష్టం చేశాడు.

తన తండ్రి మైనార్టీలతో పాటు హిందువులను కూడా సమానంగా గౌరవించేవారని, తామూ అదే బాటలో పయనిస్తున్నామన్నాడు. దేశంలో ముస్లింలపై దాడులు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపడం లేదని, కొన్ని మీడియా సంస్థలు కూడా వాళ్లకి అనుకూలంగా వార్తలురాస్తున్నాయంటూ మండిపడ్డారు. దేశంలో ఎన్ని పార్టీలున్నా ముస్లింల కోసం పోరాడేది మాత్రం మజ్లిస్‌ పార్టీయేనని ఖరాఖండిగా చెప్పేశాడు. అయితే బీజేపీ జోరు తగ్గుతుందనప్పటికీ, మజ్లిస్ కల మాత్రం ఇప్పట్లో నెరవేరే ఛాన్సే లేదని చెబుతున్నారు విశ్లేషకులు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIMIM  Akbaruddin Owaisi  2019 Elections  

Other Articles