Woman begged to Save Life Neighbours Filmed

Woman slashed with axe by husband neighbours filmed

Haryana, Haryana Crime, Haryana Woman Horrified Video, Woman Ask Save Life, Blooded Woman Help, Slash Woman Video, Baroli Jind Village, Jind Sanju Video, Woman in Blood ask for Help, Filmed Blooded Woman, Hai mar gayee Video

in Haryana Woman Slashed With Axe By Husband asked Help her, Begged . But, Neighbours Filmed Her without help. The woman, Sanju, is out of hospital but the horror of what she suffered has been viewed by thousands online.

ITEMVIDEOS:చచ్చిపోతున్నా.. కాపాడండయ్యా...!

Posted: 07/03/2017 03:50 PM IST
Woman slashed with axe by husband neighbours filmed

హర్యానాలో ఘోరం చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో రక్తపు మడుగులో కొట్టుకుంటున్న ఓ మహిళ తన ప్రాణాలను కాపాడమని వేడుకుంటున్న వీడియో ఒకటి మీడియాలో వైరల్ అవుతోంది. పక్కనే ఆమె కూతురు విలపిస్తూ భీతిని గొల్పేలా ఉన్న ఆ వీడియో జింద్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే... సంజు అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో బరోలీ గ్రామంలోని జింద్ లో జీవిస్తోంది. తాగుబోతు అయిన భర్త నరేష్ కుటుంబాన్ని పట్టించుకోవటం మానేయటంతో ఆమె కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న నరేష్ శుక్రవారం కూడా ఫుల్ గా తాగి వచ్చాడు.

 

ముందు ఆమె కళ్లలో కారం కొట్టి, ఆపై కడుపులో తన్నాడు. కింద పడిన ఆమెను పక్కనే ఉన్న రంపంతో విచక్షణా రహితంగా ఆమె కడుపు, భుజం, మోకాళ్లపై కోసేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆపై రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఆమె సాయం కోసం అర్థించింది. చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా, కొంత మంది యువకులు ఆమెను వీడియో తీస్తూ ఉండిపోయారు.

ఇంతలో అక్కడికి వచ్చిన ఎస్సై వాళ్లని ఆపి ఆంబులెన్స్ కు సమాచారం అందించాడు. చివరకు ఆస్పత్రిలో చేర్పించగా సంజూ ప్రాణాలతో బయటపడింది. ప్రమాదంలో ఉన్న వాళ్లకు తక్షణ సాయం అందించాలేగానీ ఇలాంటి పైశాచిక చేష్టలకు పాల్పడకండి అంటూ ఎస్సై రాం మెహర్ విజ్నప్తి చేస్తున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haryana  Slash Woman  Beg Help  

Other Articles