Road Inauguration Karanam and Gottipati in Scene

Karanam gottipati aides clash at road

Addanki, Addanki TDP Clash, Karanam Gottipati Aides, Karanam Balaram Aides, Gottipati Ravi Kumar Aides, Prakasham Politics, Prakasham TDP Chandrababu Naidu, CC Road Inauguration Clash

Karanam Gottipati Aides Clash at Addanki over road inauguration. Police enter in scene to reduce tensions.

ITEMVIDEOS:రోడ్డు శంకుస్థాపన, టెన్షన్.. టెన్షన్...

Posted: 07/08/2017 09:37 AM IST
Karanam gottipati aides clash at road

ప్రకాశం పసుపు పాలిటిక్స్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ మరోసారి ఎదురుపడే సీన్ నెలకొనటంతో పోలీసుల్లో ఆందోళన నెలకొంది. శనివారం అద్దంకిలోని సీసీ రోడ్డు శంకుస్థాపన సందర్భంగా వివాదం రాజుకునే అవకాశం ఉండటంతో ఏం జరగబోతుందా? అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఒకే రోడ్డుకు కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వర్గీయులు పోటాపోటీగా రెండు శిలాఫలకాలు ఏర్పాటు చేసి ప్రారంభించాలని చూడటమే ఇందుకు కారణం.

అద్దంకిలోని 14,17 వార్డుల సరిహద్దు పరిధిలో ప్రభుత్వ వైద్యశాల రోడ్డు నుంచి శివాలయం రోడ్డులో కట్టకిందపాలెం రోడ్డు వరకు సుమారు రూ.18లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులకు సంబంధించి శనివారం ఉదయం 10గంటలకు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌చే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని నగరపంచాయతీ అధికారులు శిలాఫలకాన్ని ఏర్పాటు చేయించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు.

 

అయితే అదే రోడ్డుకు సంబంధించి ఎమ్మెల్సీ కరణం బలరాంతో శనివారం ఉదయం శంకుస్థాపన చేయించాలని ఆయన వర్గీయులు చూస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి వాళ్లు హఠాత్తుగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేయించారు. ఇందుకోసం పలువురు కౌన్సిలర్లు, నాయకులు శుక్రవారం సాయంత్రం నగరపంచాయతీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినట్లుగా సమాచారం. ఉదయం అక్కడికి భారీగా చేరుకున్న రెండు వర్గాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో వారి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోగా పోలీసులు రెండు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నంలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Addanki  Road Inauguration  Karanam Gottipati  

Other Articles