ప్రభుత్వాల తలరాతలు నిర్ణయించే హక్కును ఓటుతో సామాన్యులకు కల్పించింది మన రాజ్యాంగం. అయితే అది ప్రాథమిక విధి కిందకు వస్తుందా? రాదా? అన్న దానిపై దశాబ్దాలుగా చర్చ నడుస్తూనే
ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదంటూ కేంద్రం సుప్రీంకోర్టుకు విజ్నప్తి చేస్తోంది.
రెండేళ్ల క్రితం సత్యప్రకాశ్ అనే వ్యక్తి సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. ఓటు హక్కును తప్పనిసరి చేస్తూ చట్టం తేవాలని, ఇప్పటికే గుజరాత్ రాష్ట్రం అమలు చేస్తోందని వివరించాడు. అర్జెంటీనా, బెల్జియం మరియు బ్రెజిల్ లాంటి కొన్ని దేశాలు కూడా ఓటు వేయటం తప్పనిసరిని చేశాయని గుర్తు చేశాడు. మరోపక్క ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని తప్పనిసరి చేయాలని అత్యున్నత న్యాయస్థానం కూడా ఎప్పటి నుంచో భావిస్తూ వస్తోందన్న ప్రస్తావనను పిటిషనర్ గుర్తు చేశాడు. అయితే ఓటు హక్కు వినియోగం పౌరుల ప్రాథమిక విధి కిందకు రాదని, కాబట్టి దానిని తప్పనిసరి చేయవద్దని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది.
ప్రతిగా కేంద్ర న్యాయశాఖ కోర్టుకు ఓ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఓటింగ్ తప్పనిసరి చేయడం అప్రజాస్వామిక చర్యగా అందులో పేర్కొంది. రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించి పౌరులకు ఓటు హక్కు కల్పించాం. స్వేచ్ఛ హక్కులో భాగంగా ఓటు వేయటం, వేయకపోవటం వాళ్ల విజ్నతకే వదిలేయాలి. ఎన్నికల చట్టం కూడా దానిని వినియోగించడాన్ని మాత్రం తప్పనిసరి చేయలేదని తెలిపింది. ఎన్నికల సంఘం కూడా ఓటు హక్కు కల్పించనట్లే, ఓటు వేయకపోవటమనే హక్కు కూడా రాజ్యాంగం కల్పించిందని చెబుతోంది.
పైగా ఇటువంటి పిటిషన్లను అనుమతిస్తూ పోతే ఇటువంటివే మరికొన్ని వచ్చి పడతాయని, ఫలితంగా విధానాలు, చట్టాల రూపకల్పనకు ఇబ్బందిగా మారుతుందని, పైగా ఈ అంశం బాగా ఖర్చుతో కూడుకున్న వ్వవహారం అని కేంద్రం తన వాదనలో పేర్కొంది. దీంతో జస్టిస్ ఛలమేశ్వర నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ వివరణ నేపథ్యంలో సరైన అభ్యర్థనతో రావాలంటూ పిటిషనర్ తరపున న్యాయవాదులకు సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more