ముంబై మోడల్, నటి కృతికా చౌదరి హత్య కేసు మరో మలుపు తిరిగింది. కేవలం రూ.6000 కోసమే ఆమెను హత్య చేశామని నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. నటి హత్య నేపథ్యంలో క్షణ్ణంగా ఆధారాలను పరిశీలించిన పోలీసులు అమె నివాసం వద్ద లభించిన సిసిటీవీ ఫూటేజీ అధారంగా ఇద్దరు డ్రగ్ డీలర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. కాగా వారి నుంచి వాంగ్మూలం సేకరించిన పోలీసులకు అరు వేల రూపాయల కోసమే నటిని హత్యచేశారన్న విషయం విస్తుగొలిపింది.
అయితే ఇక్కడ మరో ట్విస్టు వుంది. అమె వారి దగ్గర నుంచి గత ఏడాది జూలై లో మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి.. వాటికి సంబంధించిన డబ్బులు సంవత్సరం కాలం గడుస్తున్నా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నటి కృతికా చౌదరి ప్లాట్ కు చేరుకున్న నిందితులు అమెను డబ్బులు డిమాండ్ చేశారు. అయితే డబ్బులిచ్చే పనిలేదని.. ఏం చేసుకుంటారో చేసుకోండని అమె బదులివ్వడంతో.. ఈ విషయంలో మాట మాట పెరిగి కృతికకు నిందితులకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగిందని నిందితులు షకీల్ నసీమ్ ఖాన్, బాద్షా బసుదాస్ మక్మల్ తమ వాంగ్మూలంలో తెలిపారు.
దాంతో అవేశానికి లోనైన నిందితుల్లో ఒకరు ఆమె తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడే పడిపోయింది. అమె అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో నిందితులు పరారయ్యారు. కృతిక అపార్ట్మెంటు నుంచి దుర్వాసన రావడంతో పక్క ప్లాటు వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితులు అమెను చివరిసారిగా కలిసేందుకు వచ్చారని సీసీటీవీల్లో రికార్డుకావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అరు వేల రూపాయల కోసం హత్య చేసిననట్లు వారు తెలిపారు. అయితే కృతిక సోదరుడు ఈ విషయాన్ని కొట్టిపారేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more