అదృష్టం అడ్డం తిరిగి దురదృష్టం వెంటాడినా అశ్వం అడ్డం తిరగకపోవటంతో అతని ప్రాణాలు నిలిచాయి. సంబరంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో అపశృతి దొర్లటంతో బంధువులంతా ఆందోళనకు గురికాగా, చివరకు కథ సుఖాంతమైంది.
ఉత్తర ప్రదేశ్ లోని గొండాలో ఓ పెళ్లి కొడుకును గుర్రంపై మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. శబ్ధాలకు భయపడ్డ గుర్రం ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. దీంతో, పెళ్లికొడుకుకు ఏమవుతుందోనని అందరూ ఆందోళన చెందారు. సాయం కోసం అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది జేసీబీ సహాయంతో పెళ్లికొడుకును, గుర్రాన్ని బయటకు తీశారు. బావి లోతు ఎక్కువగా లేకపోవటం, గుర్రం ఓ పక్కగా, పెళ్లి కొడుకు మరో పక్కగా
పడిపోవటంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. బావి నుంచి బయటకు తీసిన తర్వాత వరుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతగాడు కొలుకుంటున్నాడని, త్వరలో మరో ముహుర్తం పెట్టుకుంటున్నట్లు బంధువులు వెల్లడించారు.
#WATCH: Rescue operation of a horse that fell into a well alongwith the bridegroom during a wedding ritual in Uttar Pradesh's Gonda(July 12) pic.twitter.com/LwxkL11f27
— ANI UP (@ANINewsUP) July 13, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more