Traffic police si use filthy language on street vendors ఎర్రగడ్డలో ట్రాఫిక్ పోలీసుల దురుసు ప్రవర్తన

Traffic police si use filthy language on street vendors

Si vulgar language on vendors, SI filthy language on vendors, SI abusive language on venors, Traffic police, shop vendors, abusive language, filthy language, traffic SI, SR nagar, Erragadda, Telangana, crime

Sr Nagar Traffic P.s SI M.Raghavandra Using Abusive And Vulgar Language on Street Vendors at Erragadda Rythu Bazar.

ITEMVIDEOS: ఎర్రగడ్డలో ట్రాఫిక్ పోలీసుల దురుసు ప్రవర్తన

Posted: 07/13/2017 04:37 PM IST
Traffic police si use filthy language on street vendors

అనునిత్యం రద్దీగా వుంటే రోడ్డు.. అందులోనూ ఉదయం, సాయంకాల వేళ్లలో బారులు తీరిన రద్దీ వుంటుంది. వాహనాలు కదులుతున్నా.. వచ్చి చేరుతున్న వాహనాలతో అసలు ట్రాఫిక్ కదులుతుందా..? లేక అలాగనే నిలిచిపోయిందా అన్న సందేహాలు కలగక మానదు. ఈ రద్దీ వేళ్లలో ఎక్కడ ఓ చిన్న వాహనం నిలిచిపోయినా.. వెనక ట్రాఫిక్ నిలిచిపోవడం శరామామాలే. అయితే ఇలాంటి ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో ట్రాపిక్ పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రతపడతారు.

ఇందులో భాగంగా ఎస్ ఆర్ నగర్ ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ కు చెందని ఎస్ ఐ రాఘవేంద్ర.. తన సిబ్బందితో ఎర్రగడ్డ రైతు బజార్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు కల్గిస్తున్న వాహనాలను రొడ్డుపై నుంచి తొలగించే చర్యలకు పూనుకున్నారు. ఆయన అదేశాలు జారీ చేసిన అక్కడి నుంచి తోపుడు బళ్లను తీసేందుకు రోడ్డుపక్కనున్న వ్యాపారులు ఏమాత్రం స్పందించలేదు. దీంతో ఆయన అసహనానికి గురై వారిపై అసభ్యపదజాలంతో దూషించారు. అయితే తమను ఉద్దేశించి చేసిన అసభ్యపదజాలంపై అక్కడి చిరువ్యాపారులు అయన వైఖరిపై అందోళన వ్యక్తం చేశారు.

దీంతో ఒక్కక్కరుగా అక్కడకు నిమిషాల వ్యవధిలో చిరువ్యాపారులు పెద్ద సంఖ్యలో గుమ్మిగూడారు. ఎస్ ఐ తమను దూషించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అయితే పరిస్తితిచేజారిపోతుందన్న క్రమంలో ఎస్ ఐ తన పోలిస్ స్టేషన్ కు ఫోన్ చేసి మరికొంత సిబ్బందిని అక్కడకు పిలిపించుకున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోను అక్కడి వ్యాపారులు సోషల్ మీడియాడాలో పోస్టు చేయాగా, అది కాస్తా నెట్ లో హల్ చల్ చేస్తుంది. అయితే కనిపించేవన్నీ నిజాలు కావు.. వినిపించేవన్నా వాస్తవాలు కావు అనేందుకు ఈ వీడియో నిదర్శనమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ట్రాఫిక్ సమస్య తలెత్తిన ప్రతీసారి పోలీసులు ఏం చేస్తున్నారని అడుగుతారు..? పోలీసులు చర్యలు తీసుకుంటే ఇలా దూకుడు, దురుసు ప్రవర్తన అని అంటారు అని కొందరు అంటున్నారు. ఇక మరికోందరు మాత్రం పోలీసులు నిత్యం తమ ప్రతాపాన్ని బడుగు, బలహీనులపైనే చూపుతారని మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Traffic police  shop vendors  abusive language  filthy language  traffic SI  SR nagar  Erragadda  Telangana  crime  

Other Articles