భర్త వేధింపులు తాళలేక, లేక అత్తవారింట గృహహింసకు గురై.. లేక వరకట్న డిమాండ్ల నేపథ్యంలో సాధరణంగా భార్యలు భర్తల నుంచి విడాకులు కావాలంటూ న్యాయస్థానాలను అశ్రయిస్తారు. లేదా తప్పుడు సమాచారం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడనో, లేక మొగుడు మగాడు కాదనో ఇలా బలమైన కారణాలు వుంటే తప్ప వారి మధ్య మనస్పర్థలు తలెత్తి.. విడాకుల కోసం భార్యతలు డిమాండ్ చేయడంలో న్యాయముంది. కానీ . తాన పంపిన మెసేజ్ ను చూసి కూడా స్పందించకుండా వదిలేసిన భర్త నుంచి విడాకులు కావాలని డిమాండ్ చేసింది ఓ భార్య. తన మేసేజ్ రిప్లై ఇవ్వలేదంటే.. తనపై ప్రేమ లేకనే అన్న కోణంలో అటోచించిన భార్య విడాకులు కోసం న్యాయస్థానాన్ని అశ్రయించింది. అయితే కోర్టు కూడా అమె వాదనను బలపరుస్తూ అమెకు విడాకులను మంజూరు చేయడం ప్రపంచ వ్యాప్త జంటలను విస్తుగొలుపుతుంది. వివరాలోకి వెళితే..
తైవాన్‌కి చెందిన లిన్ అనే మహిళ తన భర్త తాను చేసిన మెసెజ్ లకు రిప్లై ఇవ్వట్లేదని.. తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని చెబుతూ కోర్టులో ఇటీవల విడాకులకు దరఖాస్తు చేసుకుంది. లిన్ గత ఆరు నెలల్లో పలుమార్లు తన భర్తకు లైన్ అనే మెసెజింగ్ యాప్ ద్వారా మెసేజ్ లు పంపింది. అయితే వాటిని చూసినప్పటికీ ఆమె భర్త బదులు ఇవ్వలేదు. దీంతో ఒకే ఇంట్లో ఉంటున్నా కొన్నాళ్లుగా ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. అంతెందుకు ఒకసారి లిన్ కారు ప్రమాదానికి గురైన సమయంలో మెసేజ్ పెట్టినా.. చూసి కూడా రిప్లై ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇలా మెసేజ్ లకు బదులు ఇవ్వకుండా తనను తన భర్త నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆమె కోర్టులో ఆరోపించింది. తన భర్త మెసేజ్ లకు బదులు ఇవ్వకపోగా.. తన తల్లిదండ్రులకు.. సోదరీమణులకు సేవలు చేయాలని ఆర్డర్ వేస్తున్నాడట. అంతేకాకుండా వారి ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని తన గోడును కోర్టులో వెల్లబుచ్చింది. అంతా విన్న న్యాయమూర్తి లిన్ చేసిన మెసెజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడం బట్టి ఆమె భర్త తనపై నిర్లక్ష్యంగా ఉన్నాడని భావించారు. దీంతో వెంటనే వారికి విడాకులు మంజూరు చేసేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more