రోజు రోజు విచారణలో భాగంగా కొత్త విషయాలు వెల్లడి అవుతుండటంతో డ్రగ్స్ కేసు తీవ్రత ముదిరిపోతుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ముందుకు సాగుతామని ఎక్సైజ్ డీఐజీ అకున్ సబర్వాల్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న అకున్ కు బెదిరింపులు వస్తుండటం కలకలం రేపుతోంది.
దాదాపు 10 రోజులుగా డ్రగ్ మాఫియా అకున్ సబర్వాల్ ను బెదిరిస్తూ వస్తోందంట. ఈ విషయాన్ని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రతిరోజూ ఫోన్ చేసి అంతు చూస్తామని బెదిరించే డ్రగ్ మాఫియా...నిన్నటి నుంచి రూట్ మార్చి బెదిరింపులకు పాల్పడుతోందని తెలుస్తోంది. నీ పిల్లలు ఏ స్కూల్ లో చదువుతారో తెలుసు, ఏ వాహనాల్లో, ఎప్పుడు? ఎక్కడికి? వెళ్తారో కూడా తెలుసు...అంటూ హెచ్చరిస్తున్నారంట. ఇప్పటికే రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది. కాగా, అవతల నుంచి మాట్లాడిన వ్యక్తి యాసను బట్టి అతనో ఆఫ్రికన్ దేశానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడని తెలుస్తోంది.
ప్రపంచంలో ఏదో మూల ఉన్న ఓ వ్యక్తి తెలంగాణలో ఎక్సైజ్ చీఫ్ నంబర్ సంపాదించగలిగాడంటే కెల్విన్ నెట్ వర్క్ ఎంత పెద్దదో అర్థమైపోతుంది. విచారణంలో భాగంగా కెల్విన్ ముఠాకు నెదర్లాండ్, ఐరోపాలోని పలు దేశాలతో పాటు అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారి నుంచే అకున్ కు హెచ్చరికలు జారీ అవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. అకున్ అంత స్థాయి ఉన్నతాధికారి, పైగా కేసు తీవ్రమైంది కావటంతో ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకుని డ్రగ్ మాఫియా అంతు చూసేందుకు రెడీ అయినట్లు సమాచారం.
సుబ్బరాజును డీల్ చేసింది ఆయనే...
టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్ రాకెట్ లో సిట్ సుబ్బరాజును విచారించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం 9:50 నిమిషాలకు సిట్ కార్యాలయానికి లాయర్ తో కలిసి చేరుకున్న సుబ్బరాజుకు సిట్ బృందం పలు ప్రశ్నలు సంధించింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సుబ్బరాజు నుంచి వచ్చిన సమాధానం... 'నాకు తెలియదు... నాకు సంబంధం లేదు...ఏమో'... ఇదే వరస! మధ్యాహ్నం లంచ్ తరువాత మరికొందరు అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగినా సుబ్బరాజు నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. తనకు డ్రగ్స్ అలవాటు లేదనే తెలిపాడు. కావాలంటే పరీక్షలు చేసుకోవాలని సూచించాడు.
దీంతో ఇక లాభం లేదని సిట్ అధికారులు అకున్ సబర్వాల్ కు సమాచారం అందించడంతో ఆయన రంగంలోకి దిగారు. అకున్ ఎంట్రీతో విచారణ విధానం పూర్తిగా మారిపోయింది. పలు సాక్ష్యాలు చూపించి వాటిపై వివరణ అడిగారు. దీంతో సుబ్బరాజుకు సమాధానం చెప్పకతప్పలేదని, దీంతోనే ఆయన టాలీవుడ్ లో వేళ్లూనుకున్న డ్రగ్స్ గురించిన పలు వివరాలు, చిత్ర సీమలో సుదీర్ఘకాలంగా ఉంటున్న ఓ కుటుంబానికి సంబంధించిన వివరాలు అందించాడని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more