ఫోన్లలో బూతు వీడియోలు ఉన్నాయా? బీ కేర్ ఫుల్ | Porn Clips In Phones troubles to Job Seekers

Saudi arabia put porn in top of ban list

Saudi Arabia, Saudi Arabia Porn Ban, Saudi Arabia New Laws, Saudi Arabia Laws to Job Seekers, Saudi Arabia Job Seekers, Porn Ban Saudi Countries, Saudi Arabia Local Laws, Pan Masala Talisman Ban

Saudi Arabia Government Tells Job Seekers To Rid Themselves Of Pan Masala, Talismans And Porn Clips In Phones. According to reports, every year almost 30 lakh Indians leave India to find a job in Saudi Arabia. A large number of them get either arrested under lawsuits or gets fired for breaking the local laws.

బూతు వీడియోలు ఉంటే బుక్కయినట్లే...

Posted: 07/24/2017 05:24 PM IST
Saudi arabia put porn in top of ban list

అడల్ట్ కంటెంట్ ను పూర్తిగా బ్యాన్ చేయలేని దేశాలు కాస్త.. కూస్తో రూల్స్ తో కంట్రోల్ చేసేందుకు యత్నిస్తున్నాయి. మన దేశంలో అది సాధ్యమయ్యే పని కాకపోయినప్పటికీ, శిక్షలు కఠినంగా అమలు అయ్యే సౌదీ దేశాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఉపాధి కోసం వెళ్లే వాళ్లపై నియంత్రణ చేస్తూ కొత్త నిబంధనలను అక్కడ ప్రభుత్వం ప్రకటించింది.

పలు దేశాల నుంచి ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున్న పనుల కోసం వలసలు వెళ్తుంటారు. అందులో ఇండియా నుంచి అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఇలా వెళ్లేవారు విమానం ఎక్కే ముందు తమ ల్యాప్ ట్యాప్, స్మార్ట్ ఫోన్ సరి చూసుకోవాలని సూచిస్తున్నారు. అశ్లీల వీడియో లేదా ఆడియో క్లిప్ లు, చిత్రాలు దొరికితే మాత్రం వాళ్లకు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రీసెంట్ గా చేసిన సవరణలలో నిషిద్ధ వస్తువుల జాబితాలో అశ్లీలానికి సంబంధించిన అంశాలే టాప్ పొజిషన్ లో చేర్చారు.

దీంతోపాటు మాదకద్రవ్యాలు, గసగసాలు, పంది మాంసం, తమలపాకులు, పాన్ మసాలాలతోపాటు ఇస్లాం కాకుండా ఇతర మతాలకు సంబంధించిన గ్రంథాలు లేదా సాహిత్యాన్ని కూడా తీసుకెళ్లడం నిషేధమని వారు స్పష్టం చేశారు. ముస్లిం ఖాజాలిచ్చే తాయెత్తులను కూడా సౌదీ అరేబియా అనుమతించడం లేదని వారు స్పష్టం చేశారు. వీటితోపాటు ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు డబ్బు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల వెల్లువెత్తుతుండటంతో అసలు ఆ అవసరం లేదని అక్కడి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఏడాదికి సుమారు 30 లక్షల మంది సౌదీకి ఉద్యోగాల నిమిత్తం వస్తుంటారని, వారిలో చాలా మంది అక్కడి స్థానిక చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తించి అరెస్ట్ అవుతుంటారని తెలిపింది. అందుకే ిఇప్పటి నుంచి నిబంధనలు కఠినతరం చేయాలన్న ఆదేశాలను జారీచేసినట్లు వెల్లడించింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saudi Arabia  Job Seekers  Porn Ban  

Other Articles