RBI likely to release Rs 200 note next month ఆగస్టులో రూ.200 నోట్లు వచ్చేస్తున్నాయహో..

Rbi stops printing rs 2000 notes focus turns to rs 200 notes

rs 200 notes, rs 200 notes launch, rs 200 notes news, rs 200 news, rs 2000 news, rbi, rbi news demonetisation, rs 200 printing, rbi india, pink notes, demonetisation, indian economy

The Reserve Bank of India (RBI) has reportedly stopped the printing of Rs 2000 currency notes and the new Rs 200 notes are likely to be introduced next month.

రూ.200 నోట్లు వచ్చేస్తున్నాయహో.. గులాబీ నోట్ల ప్రింటింగ్ కు చెక్..

Posted: 07/26/2017 03:25 PM IST
Rbi stops printing rs 2000 notes focus turns to rs 200 notes

పాత పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో భారతీయులకు అందిన మరో పెద్ద నోటు రూ.2000 ఈ మధ్య ఎక్కడా దర్శనమివ్వడం లేదు. ఏ ఏటీయం కేంద్రంలో డబ్బులు డ్రా చేసినా.. లేక ఏ బ్యాంకులోనైనా డబ్బులు తీసుకన్నా పెద్ద నోటు మాత్రం కనిపించడం లేదని ఇటీవలి కాలంలో జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియాలన్ని దానిని చర్చనీయాంశంగా మార్చేశాయి. అయితే ఆర్బీఐ ఈ నెలలో కొత్తగా చలామణిలోకి ప్రవేశపెట్టనున్న రూ.200 కోసం.. పెద్ద గులాబీ నోటు ప్రింటింగ్ ను భారతీయ రిజర్వు బ్యాంకు నిలిపేసిందని సమాచారం. ఇక రూ. 200 నోట్ల ప్రింటింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

రూ. 200 నోటును విరివిగా ప్రజలకు అందుబాటులో వుండేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో ఈ నోట్లను ముద్రిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం ఐదు నెలల క్రితమే రూ.2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ు నిలిపివేసినట్లు సమాచారం అందుదోంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నోట్లను ముద్రించబోదని కూడా తెలుస్తుంది. అయితే ఇదే సమయంలో కొత్తగా చలామణిలోకి తీసుకురానున్న రూ.200 నోటుపై ఎక్కువ దృష్టిసారించిన రిజర్వు బ్యాంకు గత నాలుగు నెలలుగా రూ.200 ముద్రణను మాత్రం వేగవంతంగా చేసినట్లు సమాచారం.

ఇక దేశ స్వాతంత్ర దినోత్సవం రోజున అంటే అగస్టు 15న కొత్తగా చెలమాణిలోకి రూ. 200 నోటును తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో అటు చిల్లర సమస్య ఇకపై ఉత్పన్నం కాకుండా ఇటు నగదు కొరతను తీర్చేందుకు రూ.200 నోటు దోహదం చేస్తుందని రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే రూ.200 నోటుకు ఉన్నతస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించినట్లు సమాచారం. అయితే వీటికి నకిలీ నోట్లను ముద్రించేందుకు వీలు లేదని కూడా అర్బీఐ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rs 200 notes  rs 2000 notes  pink notes  new rs 200 notes  demonetisation  indian economy  

Other Articles