తెలుగు సినీపరిశ్రమతో పాటు రాష్ట్రంలోని సంపన్న కుటుంబాలకు చెందిన సంతానానికి విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ అలవాట్ల చేయడంలో ఈ మాఫియాపై ఉక్కపాదం మోపుతున్న ఎక్సైజ్ అధికారులు అరెస్టు పర్వాన్ని కొనసాగిస్తున్నారు. విద్యార్థులు డ్రగ్స్ వాడకాన్ని నేర్పిస్తున్నారన్న క్రమంలో ప్రారంభమైన డ్రగ్స్ విక్రయదారుల అరెస్టులు.. వారికి టాలీవుడ్ పరిశ్రమలోని ప్రముఖలతో వున్న సంబంధాలు వెలుగు చూసిన నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చి.. విచారణ చేపడుతన్న విషయం తెలిసింది.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సీనీ నటి కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీని కూడా ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే రోని అరెస్టు తో తనకు సంబంధం ఏమీ లేదని, కేవలం వృత్తిపరంగా మాత్రమే తనకు తెలుసునని అమె చెప్పిన విషయం తెలిపిందే. కాగా తాజాగా అబ్కారీ శాఖ పోలీసులు ఈ కేసులో కిలక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని ఇవాళ న్యాయస్థానంలో హాజరుపరుస్తామని ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. అయితే ఇతనికి ఎవరెవరితో సంబంధాలు వన్నాయన్న విషయమై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
నెదర్లాండ్ దేశానికి చెందిన 35 ఏళ్ల మైక్ కమింగను నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అకున్ తెలిపారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఆరు రోజుల పాటు ప్రయత్నించి మైక్ కమింగను పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి డ్రగ్స్ ను స్వాథీనం చేసుకున్నామని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాల్లో కూడా మైక్ కమింగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన వీసాను పరిశీలిస్తే నాలుగు పర్యాయాలు కమింగ భారత్ కు రాగా, రెండు పర్యాయాలు హైదరాబాద్ కు వచ్చారని పోలీసులు తెలిపారు. అయితే అతనికి హైధరాబాద్ లో సాప్ట్ వేర్ ప్రోషెషనల్స్ తో సాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి కూడా లింకులు వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మైక్ కమింగను విచారిస్తే కొత్త పేర్లు బయటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more