Drunk woman kisses cop to avoid arrest after accident నడిరోడ్డుపై పోలీసుకు యువతి ముద్దు

Drunk woman kisses cop to avoid arrest after accident

drunk woman kisses cop, Drunk woman kisses cop to avoid arrest, bizarre, Chingrighata Mor, arrest, passionate kiss, midnight, accident, Bidhannagar police station, kolkata, crime

A woman in Kolkata was arrested after she allegedly kissed a police officer on duty when she was pulled over for being in an inebriated state,

నడిరోడ్డుపై పోలీసుకు కిస్ తో కిక్కు ఇచ్చిన యువతి

Posted: 07/28/2017 03:17 PM IST
Drunk woman kisses cop to avoid arrest after accident

ఎక్కడో సప్త సముద్రాల అవతల విచ్చలవిడీ సంస్కృతి పరిఢవిల్లే దేశంలో.. తాగి వాహనాన్ని నడుపుతున్నారో.. అతివేగంగా వెళ్తున్నారనో.. లేక ప్రమాదానికి కారకులయ్యారనో అక్కడి మహిళలను పోలీసులు అరెస్టు చేస్తే దాని నుంచి తప్పించుకునేందుకు వారు అక్కడి పోలీసుకు ముద్గు పెట్టి తప్పించుకున్న ఘటనలు మనం విన్నాం. కానీ ఇక్కడ మనదేశంలోనూ ఇలాంటి ఘటనలు నమోదు అవుతున్నాయంటే నమ్మగలమా..? కానీ అదే జరిగింది. పాశ్చ్యాత సంస్కృతికి అలవాటు పడుతున్న యువత తాగిన మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థాయికి దిగజారుతున్నారని అనడానికి ఇది ఒక ఉదాహరణ.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా పరిధిలోని ఈస్ట్రన్ మెట్రోపాలిటన్ నగరంలోని సాల్ట్ లేక్ సమీపంలో అదే జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ కారు ప్రమాదానికి పాల్పడిన ఓ మహిళను అరెస్టు చేయబోయిన పోలీసులకు ఆమె నుంచి చిత్రమైన స్పందన రావడంతో పోలీసు అవ్వాకయ్యాడు. తాగిన మైకంలో తనను అడ్డుకున్నపోలీస్ కానిస్టేబుల్ ను ఆమె ఘాటు ముద్దులతో ముంచెత్తింది. దీంతో బిత్తరబోయిన పోలీసు ఆమెతో పాటున్న మరో మహిళ సాయంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
 
వివరాల్లోకి వెళ్తే.. 30 ఏళ్ల వయసున్న ఓ మహిళ.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ పార్టీ నుంచి తిరిగి వస్తోంది. సాల్ట్ లేక్ సమీపంలోని చిన్గ్రిగ్హటా బైపాస్ రోడ్డు వద్దకు రాగానే కారుపై నియంత్రణ కోల్పోయింది. ఎదురుగా వెళుతున్న మరో కారును గమనించకుండా నడిపింది. చివరి క్షణంలో కారును తప్పించకున్న అమె..రోడ్డు ఢివైడర్ ను ఢీకొట్టింది. అవతలి కారు డ్రైవర్ దిగివచ్చి ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తే అతడి చెంప చెళ్లుమనిపించేసింది. ఈలోగా బిధాన్ నగర్ పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని ఆమెతో పాటు మరో ఇద్దరిని బయటికి తీశారు.
 
వారంతా తాగివున్నట్టు గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తుండగా..  కారు నడిపిన 30 ఏళ్ల మహిళ అమాంతం కానిస్టేబుల్ ను హత్తుకుని అతని ముఖంపై ఘాటు ముద్దులు కురిపించింది. క్షణంలో అతన్ని తన విధులు మర్చిపోయేలా మైకంలో కమ్మెసింది. అమె చేష్టలతో బిత్తరపోయిన పోలీసు.. తేరుకుని అమె స్నేహితురాలి సాయంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు ఆమెపై అనుచిత ప్రవర్తన కింద కేసులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bizarre  Chingrighata Mor  arrest  passionate kiss  midnight  accident  Bidhannagar police station  kolkata  crime  

Other Articles