IndiGo offers special fares for 11th anniversary sale వార్షికోత్సవ వేళ కస్టమర్లకు ఇండిగో బంఫర్ అఫర్..

Indigo offers fares starting at rs 1111 to mark 11th anniversary

Indigo sale, Indigo, low airfares, cheap flights, cheap air fares, Air fares, Air fare war, indigo 11th anniversary offer, indigo anniversary offer, indigo anniverasry sale, Rs 1111 offer, air tickets @ 1111, air asia, true jet, goair,

Low-cost carrier IndiGo is offering a five-day special sale with fares starting at Rs 1,111 to mark its 11th anniversary.

వార్షికోత్సవ వేళ కస్టమర్లకు ఇండిగో బంఫర్ అఫర్..

Posted: 08/02/2017 05:27 PM IST
Indigo offers fares starting at rs 1111 to mark 11th anniversary

దేశీయ చౌకధర విమానయాన సంస్థ ఇండిగో తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. తమ సంస్థ పదకొండవ వార్షికోత్సవ వేళ.. ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ మరోమారు తగ్గింపు ధరల్లో విమానయాన సౌకర్యాన్ని కల్పిస్తుంది. అయితే గతంలో మాదిరిగా అనేక సంస్థలు కేవలం ఒకటి రెండు మార్గాలకు మాత్రమే వర్తింపజేసిన చౌకధరలను ఇండిగో ఏకంగా 45 ప్రాంతాలకు వర్తింపజేస్తుంది. అంతేకాదు ఎంపిక చేసిన విదేశీయనానికి కూడా ఇదే తగ్గింపు ధరలో ప్రయాణించే అవకాశాన్ని తమ ప్రయాణికులకు కల్పిస్తుంది.

ముఖ్యంగా ఇండిగో సంస్థ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారీ డిస్కౌంట్‌ ధరలను ప్రకటించింది. రూ.1111 నుంచి ప్రారంభమయ్యే టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. అన్ని పన్నులతో కలిపి ఈ చౌకదర విమాన టిక్కెట్లను విక్రయించనున్నట్టు ఇండిగో వెల్లడించింది. అంతేకాదు ఈ తాజా  ఆఫర్‌ను కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు వర్తింపచేయడం విశేషం. ఐదు రోజుల పాటు ఈ ఆఫర్ కింద టిక్కెట్లను కొనుగోలు చేసుకునే వెసలుబాటును కూడా కల్పించింది. ఈ ఆఫర్‌ కింద ఈ రోజు  (ఆగస్టు 2 )నుంచి ఆగస్టు 6 వరకు టికెట్ల బుకింగ్‌ అందుబాటులో ఉండనున్నాయి.

ఈ టికెట్ల ద్వారా ఆగస్టు 21 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 వరకు ప్రయాణించవచ్చు. మొబీక్విక్‌ వ్యాలెట్‌ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకున్నట్టయితే మరో 11 శాతం ఆఫర్ ఇస్తోంది. ఈ ఆఫర్ కింద, డబ్యూడబ్యూడబ్యూ గోఇండిగో.కామ్ లేదా ఇండిగో మొబైల్ యాప్ తో  బుక్‌ చేసుకుంటే  11 శాతం సూపర్‌ క్యాష్ బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తోంది. సుమారు రూ. 600 రూపాయల  దాకా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్  అందిస్తుంది. అన్ని బుకింగ్ ఛానెళ్లలోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటాయనీ, అయితే నాన్ స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తా లాంటి మెట్రో నగరాలతోపాటు, చిన్న నగరాలైన భువనేశ్వర్, చండీగఢ్, పూణె, అహ్మదాబాద్ లోని ఈ ఇక్కడ ఇండిగో విమానాల జాబితాలో ఉన్నాయి. అంతేకాదు షార్జా, సింగపూర్, మస్కట్, దుబాయ్, దోహా, పోర్ట్ బ్లెయిర్‌ వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఇండిగో తాజా పథకం కూడా చెల్లుతుంది. అగర్తలా, అహ్మదాబాద్‌, అమృత్‌సర్‌, బ్యాంకాక్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, ఛండీగఢ్‌, చెన్నై, కోయంబత్తూరు, డెహ్రాడూన్‌, దిల్లీ, డిబ్రుఘడ్‌,  గోవా, గువాహటి, హైదరాబాద్‌, ఇంఫాల్‌, ఇండోర్‌, జైపూర్‌, జమ్మూ, కోచి, కోల్‌కతా, కోజికోడ్‌, లక్నో, మధురై, మంగుళూరు, ముంబయి,  నాగపూర్‌,  పుణె, రాయిపూర్‌, రాంచీ,  శ్రీనగర్‌, తిరువనంతపురం, ఉదయ్‌పూర్‌, వడోదర, వారణాసి, విశాఖపట్నం లో ఈ  టిక్కెట్లు బుక్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indigo  11th anniversary  offers  sale  Rs 1111 offer  goair  low airfares  airfare war  

Other Articles