ఇంట్లో వున్న చికెన్ నచ్చదు కానీ పోరిగింటి పుల్ల కూర మాత్రం రుచిగా వుందని అనని మగవాడంటూ లేడని సినీ కవులు ఎన్నో సినిమాల్లో డైలాగుల రూపంలో చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజమని స్పష్టం చేస్తుంది ఈ ఘటన. అతడు బాధ్యతగల ప్రభుత్వ ఉద్యోగి. అందులోనూ అనునిత్యం అప్రమత్తంగా మెలగాల్సిన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నందున అతను మరింత జాగ్రత్తగా, బాధ్యతగా మెలగాల్సి వుంది. కానీ జనగామ కలెక్టర్ అఫీసులో సినియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న రాజనర్సింహ మాత్రం మరో మహిళతో అక్రమంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
తన భార్యా పిల్లలను కాదని మరో మహిళతో సంబంధం పెట్టుకోవడంతో అనోటా.. ఈ నోటా చివరకు విషయం భార్య చెవిన పడే వరకు చేరింది. అయితే అంతకు ముందే భర్త ప్రవర్తనపై అనుమానం కలిగిన భార్య ఈ విషయమై భర్తను అడిగింది. అలాంటిదేమీ లేదని చెప్పాడు. ఈ మధ్యలో వివాహేతర సంబంధం విషయం కూడా అమె చెవినపడటంతో భర్తను నిలదీసింది. ఫలితంగా పచ్చని సంసారంలో సమస్యలు మొదలయ్యాయి. అయితే ఈ విషయమై.. తాను ఎలాంటి తప్పు చేయడం లేదంటూ బుకాయిస్తూ రావడంతో భార్య తరపు బంధువులు కూడా అతడి మాటలను నమ్మారు.
కాగా తమ భిడ్డ మనోవేదనతో బాధపడటం భరించలేని అమె తండ్రి విషయాన్ని బంధువులకు తెలిపాడు. అయితే వారు అతడి అటకట్టించేందుకు ప్రణాళిక వేశారు. రాజనర్సింహ గుర్తుపట్టని నలుగురు యువకులు అతనికి తెలయకుండా అతన్ని ఫాలో అయ్యారు. అతని కదలికలపై అదే మార్గంలో వున్న మరికోందరు యువకులకు సమాచారం ఇచ్చారు. ఇలా మొత్తానికి రాజనర్సింహ్మ పరాయి మహిళతో ఏకంతంగా గడుపుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గాపట్టుకున్న బంధువులు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more