Mob attacks Rahul Gandhi's car with stones in Gujarat ప్రతిపక్ష నేత పర్యటనలో భద్రతా లోపం.. పోలీసులెందుకు..?

Rahul gandhi s car attacked in gujarat s flood hit banasakantha

rahul gandhi shown black flags, black flags shown to rahul gandhi, stone thrown at rahul gandhis vehicle, rahul gandhi gujarat visit, congress vice-president rahul gandhi banaskantha visit, Rahul Gandhi, Gujarat floods, Banaskantha, convoy attacked, Dhanera, police, bjp, pm modi, amit shah, politics

Congress vice-president Rahul Gandhi’s car was pelted with stones while he was travelling during his tour to the flood-affected Banaskantha district of Gujarat

ప్రతిపక్ష నేత పర్యటనలో భద్రతా డొల్లతనం..?

Posted: 08/04/2017 05:35 PM IST
Rahul gandhi s car attacked in gujarat s flood hit banasakantha

గుజరాత్ లోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లి అక్కడ బాధితులతో భేటీ అయ్యి వారిని పరామర్శించి వస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాన్వాయ్ పై.. తిరుగు ప్రయాణంలో గుర్తు తెలియని అగంతకులు రాళ్తతో దాడులకు పాల్పడ్డారు. అగంతకుల దాడిలో రాహల్ గాంధీ కారు అద్దాలు ధ్వంసం కాగా, ఆయన తృటిలో తప్పించుకున్నారు. అయితే ఈ ఘటనపై జిల్లా ఎస్సీ ప్పందించి.. రాహుల్ పై దాడి జరిగిందని దృవీకరించారు. ఎవరు దాడి చేశారన్న విషయాలు తెలియదని అన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు తామున్నామన్న భరోసా ఇచ్చేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ చకచకా పని చేసుకువెళ్లారు. బనస్కాంత జిల్లాలోని ఆయన వరదభాధితులను పరామర్శించారు. కాగా తిరుగు ప్రయాణమై ధనేర ప్రాంతానికి చేరుకోగానే రాహుల్ గాంధీని పర్యటనను అడ్డుకుని నల్లజెండాలను ప్రదర్శించిన బీజేపి నేతలు.. అయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో గుర్తుతెలియని అగంతకులు రాహుల్ కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు. ఆ రాళ్లు ఏకంగా రాహుల్ ప్రయాణిస్తున్న కారునే గురి చేసినట్టుగా తగిలి వెనకాలి సీటు కిటికీలు ధ్వంసమయ్యాయి.


ప్రధాని నరేంద్ర మోదీకి జై అంటూ భారీ ఎత్తున నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వడంతో కాంగ్రెస్ నాయకులు షాకయ్యారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన బనాస్‌కాంత జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బీజేపీ కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపించారు. వరద బాధితులను పరామర్శించడానికి వస్తేనే ఇలా మీ వెన్నులో వణుకు పుడితే.. ఇక రాజకీయాంతో రాహుల్ గుజరాత్ లో అడుగుపెడితే.. పూసలు కూడా కదిలిపోతాయని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Gujarat floods  Banaskantha  convoy attacked  Dhanera  police  bjp  pm modi  amit shah  politics  

Other Articles