belli betta producer Huthesh Kenchikoppa arrested తప్పుడు పనులు చేసి.. అరెస్టయిన సినీ నిర్మాత..

Belli betta producer huthesh kenchikoppa arrested

belli betta producer arrested, belli betta producer Huthesh arrested, producer Huthesh Kenchikoppa arrested, belli betta producer Huthesh Kenchikoppa arrested, belli betta, producer, Huthesh Kenchikoppa, arrest, sandalwood, crime

belli betta producer Huthesh Kenchikoppa and two others arrested for looting a man in karnataka. police recieved complaint and made arrests within few hours.

తప్పుడు పనులు చేసి.. అరెస్టయిన సినీ నిర్మాత..

Posted: 08/10/2017 10:48 AM IST
Belli betta producer huthesh kenchikoppa arrested

తానోక సినీ నిర్మాత.. తన పరపతిని మంచి కోసం వినియోగించుకుని మరింత మందిలో తనదైన ముద్ర వేసుకోవాల్సిన వాడు.. సంఘవిద్రోహ శక్తిలా వ్యవహరించడంతో ప్రస్తుతం కటకటాలను లెక్కపెడుతున్నాడు. వ్యక్తిని నిర్బంధించి అతని నుంచి నగదు, బెంజ్‌ కారును లాక్కొని బెదిరింపులకు గురి చేయడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఈ ఘటన శాండిల్ వుడ్ లో కలకలం రేపుతోంది. నిర్మాతతో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే..  బెంగళూరులోని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్న తబ్రేజ్ కు ఫోన్ చేసిన నిందితుల ముఠా.. తమ వద్ద రూ.30 కోట్ల నల్లధనం, విలువైన వజ్రాలు ఉన్నాయని, ఈ విషయంపై డీల్‌ చేసుకుందాం రమ్మని పిలిచారు. అది నమ్మిన తబ్రేజ్ వారి వద్దకు వెళ్లాడు. తబ్రేజ్ ను..  హుత్తేష్ తమ హొన్నాళి తాలూకా కంచికొప్ప గ్రామానికి తీసుకెళ్లి అక్కడి తమ ఇంటిలో గత నెల 29 నుంచి 31 వరకు నిర్బంధించాడు. అతని వద్ద ఉన్న రూ.2 లక్షల నగదు, బెంజ్‌ కారును లాక్కొని, ఈ విషయం గురించి ఎక్కడైనా నోరు విప్పితే ప్రాణాలు తీస్తామని బెదిరించాడు, 31న బెంగళూరు బస్సు ఎక్కించి వెళ్లిపోయారు.

దీనిపై తబ్రేజ్ న్యామతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూరల్ డీఎస్పీ ఎంకే గంగల్ నేతృత్వంలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి నిందుతలు కోసం గాలించడం ప్రారంభించారు. హొన్నాళి తాలూకా కుమారగట్టె గ్రామ సమీపంలో రెండు కార్లలో వస్తున్న నిందితులను పట్టుకుని వారి నుంచి రూ.68.66 లక్షల విలువ చేసే మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు, ఫోర్డ్‌ ఎకో స్పోర్ట్స్‌ కారు, 3 మొబైల్‌ ఫోన్లు, రూ.36 వేల నగదును స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో కీలక సూత్రధారి శాండిల్ వుడ్ బెళ్లిబెట్ట చిత్ర నిర్మాత హుత్తేష్ కెంచికోప్పను అరెస్టు చేశారు.

అతనితో పాటు తాలూకా పంచాయతీ మాజీ ఉపాధ్యక్షుడు పీఎస్ హుత్తేష్, ఎస్ఎస్ లేఔట్ నివాసి, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మాజీ ఉద్యోగి గురురాజ్, శివకుమార స్వామి బడావణె నివాసి, దునియా విజి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ఎస్ దొడ్డేష్ లను అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్‌ భీమా శంకర్‌ ఎస్‌.గుళేద్ తెలిపారు. ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : belli betta  producer  Huthesh Kenchikoppa  arrest  sandalwood  crime  

Other Articles