దేశంలో మహిళలపై అఘాయిత్యాలకు అడూఅదుపు లేకుండా పోతుంది. నిర్భయ ఘటన తరువాత నూతన చట్టాన్ని తీసుకువచ్చినా.. ఘటనలు మాత్రం తగ్గడం లేదు. దేశంలో నానాటికీ మహిళలపైన పెరుగుతున్న నేరాలను అదుపు చేయడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్ని విమర్శలు వినబడుతున్నాయి. దేశంలో యోగా ఔనత్యాన్ని చాటిచెప్పి అదే సందేశాన్ని ప్రపంచ దేశాలకు పంపుతూ.. ప్రపంచ యోగా దినోత్సవాలను వేడుకగా చేసుకుంటు గర్వపడుతున్న క్రమంలో అవే ప్రపంచ దేశాలు భారత్ పర్యటనకు వెళ్లే తమ దేశస్థులకు మరీ ముఖ్యంగా మహిళా పర్యాటకులకు లైంగిక వేధింపుల విషయంలో హెచ్చరికలు చేస్తున్న విషయాన్ని కేంద్రం ఎందుకు విస్మరిస్తుందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
దేశాన్ని స్వచ్ఛ భారత్ గా మార్చడానికి ఒక యజ్ఞంలా తీసుకున్న కేంద్రం.. అంతకన్న ముఖ్యమైన అడపడుచుల భద్రత, వారు ఎదుర్కోంటున్న లైంగిక దాడులు, వేధింపులు, చెలరేగిపోతున్న పోకరీల విషయంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముస్లిం మహిళలకు తాము అండగా వుండి.. త్రిబుల్ తలాక్ విషయంలో భిన్నమైన వాదనలను తీసుకువచ్చినందరే వారందరి ఓట్లతో తాము ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చామని చెప్పుకున్న కేంద్రంలోని అధికార రాజకీయ పార్టీ.. మరి కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం ఇలాంటి ఏ తేడాలు లేకుండా అడపడచులపై జరుగుతున్న అకృత్యాలపై ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.
ఏకంగా చండీగఢ్ లో సాక్షాత్తు బీజేపీ అధ్యక్షుడి పుత్రరత్నమే మద్యం మత్తులో ఓ యువతిని వెంటాడి వేధించిన ఘటనకు పాల్పడటం.. అతనిపై పోలీసులు బెయిలెబుల్ కేసును నమోదు చేయడం.. అది కాస్తా వైరల్ అయ్యి.. విమర్శలకు తావ్వివడం.. దీంతో పోలీసులు ఎట్టకేలకు నిన్న రాత్రి అతనిపై నాన్ బెయిలెబుల్ కేసులను నమోదు చేయడం.. అంతా జరిగింది. ఇది జరిగి 24 గంటలు కూడా తిరగక్కముందే దేశరాజధాని ఢిల్లీలోని గురుగ్రామ్ లో మరోకటి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. గురుగ్రామ్ లోని ఓ ప్రైవేటు సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువతి.. తన ఉద్యోగాన్ని ముగించుకుని సోమవారం రాత్రి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వెళ్తండగా, అమెను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కారులో వెంబడించారు.
గురుగ్రామ్ సెక్టర్-18లోని ఆఫీస్ నుంచి ఆమె స్కూటర్‌పై ఇంటికి బయలుదేరి వెళ్తుండగా, కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అమెను దాదాపు మూడుకిలోమీటర్ల వరకు వెంబడించి వేధించారు. స్కూటర్ ఆపాలంటూ పదేపదే అరవడమే కాకుండా.. ఆమెను కారుతో కార్నర్ చేసి కిందపడేయాలని చూశారు. పాత ఢిల్లీ-గురుగ్రామ్ రోడ్డు సమీపంలోని అతుల్ కటారియా చౌక్ వరకు ఈ దుర్మార్గం కొనసాగిందని బాధితురాలు పోలీస్ కమీషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు. అయితే వారి అరుపులను లక్ష్యపెట్టకుండా.. తన ప్రాణాలను కాపాడుకోవాలన్న అత్రుతతో వేగంగా స్కూటర్ ను నడిపానని.. ఎంతో కష్టం మీద ఇంటికి చేరానని బాధితురాలు పిర్యాదులో పేర్కోంది.
తాను ఎదుర్కోన్న ఘటనపై పోలీసులకు పిర్యాదు చేయడానికి వెళ్లగా.. బాధితురాలి ఫిర్యాదును తీసుకోవాల్సిన పోలీలసుకు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధితురాలి అక్రందనను అర్థం చేసుకుని తరువాత సంబంధిత పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయాల్సిన పోలీసులు.. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనాస్థలం తమ పరిధిలోకి రాదని ఢిల్లీలోని సెక్టర్-14 పోలీసులు తెలిపారు. అమెను సెక్టర్-18 పోలీసు స్టేషన్ కు వెళ్లమంటూ ఆమెను తిప్పిపంపారు. దీంతో నేరుగా పోలీసు కమిషనర్ కార్యాలయాన్నే అశ్రయించిన బాధితురాలు తనకు జరిగిన ఘటనను అక్కడి అధికారులకు వివరించారు. దీంతో ఐపీసీ సెక్షన్ 354డీ (స్టాకింగ్) కింద అభియోగాలను మోపిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులను గుర్తించడానికి సీసీటీవీ దృశ్యాలు పోలీసులకు కీలకంగా మారనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more