ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని గ్రామ స్థాయి ఎన్నికలలో హామీలను గుప్పించిన ఆ గ్రామ పెద్ద నిజంగానే… ఆ గ్రామాన్ని అకస్మాత్తుగా అభివృద్ది చేశారు. ఎంతలా అంటే.. ఏకంగా ఆ పాఠశాల పేరు ఇప్పుడు జాతీయ దినపత్రికలు మొదలుకుని అంతటా మార్మోగిపోతుంది. ఇక ఆ గ్రామ పెద్ద చేసిన పనికి చుట్టుపక్కల గ్రామపెద్దలు కూడా అవ్వాక్కయ్యేలా చేశారు. వారికి తెలియకుండానే వారు కూడా అందులో భాగం పంచుకున్నారు. ఇదేంటి..? ఒక గ్రామ పాఠశాల పేరు ఇంతలా మార్మోగిపోడానికి కారణమేంటి.. అందుకు ఇరురుపోరుగు గ్రామపెద్దలు ఎలా దోహదపడ్డారని అంటున్నారా..? అక్కడికే వస్తున్నాం.
గ్రామపెద్ద చేసిన నిర్వాకంతో ఆ గ్రామస్థులు తలదించుకుంటున్నారు. గ్రామపెద్దగా చెలామణి అవుతూ గ్రామం పరువునే తీసాడు. సభ్యసమాజానికి సందేశం ఇవ్వాల్సిన పెద్ద.. సమాజంలో తమకు మర్యాద లేకుండా చేశాడని పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మొదలుకుని గ్రామ ప్రజలందరూ ఆయనపై పళ్లు కొరుకుతున్నారు. ఇంతకీ ఆయన చేసిందేమిటీ అని ప్రశ్నిస్తే.. ఏకంగా తమ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక స్కూల్ ను క్లబ్ లా మార్చి.. బార్ గాళ్స్ తో డ్యాన్సులు చేయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లాలో జరిగింది.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పౌర్ణమి పండుగ రోజునే బార్ గాళ్స్ తో డాన్సులు వేయించి.. వార్తల్లో నిలిచాడు. మిర్జాపూర్ జిల్లా జమాల్పూర్ లోని టెట్రాహియ కళా ఖుర్ద్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రక్షాబంధన్ రోజు జరిగిందీ ఘటన, బార్ గాళ్స్ అసభ్య నృత్యాలకు తమ కుటంబంలోని కొందరు వ్యక్తులు అనుకరిస్తూ డాన్సులు చేయగా, మరికొందరు ఇరుగుపోరుగు గ్రామాలకు చెందిన పెద్దమనుషులు తమ జేబుల్లోని నోట్లు తీసి బార్ గాళ్స్ పై విసురారు. ఈ వీడియో బయటకు రావడంతో గ్రామస్థులలో కలకలం సృష్టించింది.
మరుసటి రోజు టీచర్లు పాఠశాలకు రాగానే తరగతి గదులు మొదలుకుని పాఠశాల అవరణ అంతా చిందర వందరంగా ఉంది. దీంతో ఆరా తీసిన ఉపాద్యాయులకు అసలు విషయం అర్థమైంది. తన కుమారుడి జన్మదినం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని.. గ్రామ పెద్ద రామ్ కేశ్ యాదవ్ తన దగ్గరకు వచ్చి స్కూల్ తాళాలు తీసుకున్నాడని.. పాఠశాల అసిస్టెంట్ టీచర్ అశోక్ కుమార్ ప్రాథమిక శిక్షా అధికారి ప్రవీణ్ కుమార్ తివారీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించారు అధికారులు. అయితే బార్ గాల్స్ డాన్సులపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more