తనకు తాను దైవదూతగా చెప్పుకున్న వివాదాస్పద స్వామీజీ.. తొమ్మిదేళ్ల నాటి దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట చేశారు. అవునా.. తొమ్మిదేళ్ల క్రితం దొంగతనం చేస్తే ఇప్పుడు అరెస్టు చేస్తారా..? అంటే నేరం ఎప్పటికైనా నేరమే కదా. వివాదాస్పద స్వామీజీ స్వామి ఓంపై దొంగతనం కేసులో అభియోగాలు నమోదు కావడంతో.. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. హిందీ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న దేశరాజధాని నగరం ఢిల్లీలోని లోధి కాలనీలో పోలీసులు అరెస్టు చేశారు.
తన సైకిల్ దుకాణం తాళాలు పగుల గొట్టి అందులోని 11 సైకిళ్లు, వాటి విడి భాగాలుతో పాటు తన అస్తికి సంబంధించిన పలు విలువైన డాక్యూమెంట్లను స్వామి ఓం దొంగలించాడని ఆయన సోదరుడు ప్రమోద్ ఝా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో పోలీసులు ఈ కేసును నమోదు చేయలేదు. స్వామీ ఓం లాంటా గురువులతో తమకెందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ పెద్దగా పట్టించుకోలేదు. తన దుకాణం తాళాలు పగుల గోట్టి స్వామీ ఓంగా పేరు మార్చుకున్న తన అన్న వినోదానంద ఝా తన ఇంటి సేల్ డీడ్ సహా పలు పత్రాలను దొంగలించాడని ప్రమోద్ ఝా పోలీసులకు పిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసేందుకు కూడా సంశయించడంతో పలుమార్లు పోలీసుల చుట్టూ తిరిగిన అయన ఇక చేసేది లేక న్యాయస్థానాన్ని అశ్రయించి ప్రైవేటు కంప్లేంట్ దాఖలు చేశారు. దీంతో సాకేత్ కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న స్వామి ఓంని ఢిల్లీలోని భజనపురాలో అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, పనులు చేయడం ద్వారా గతంలో పలుమార్లు పలువురి చేతుల్లో దేహశుద్ది చేయబడిన స్వామీ ఓంను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేయడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more