చిత్తూరు ఫైర్ యాక్సిడెంట్ పై డౌట్లు! | Fire Accident in Chittoor Textile Showroom

Fire accident in chittoor cloth show room

Fire Accident, Chittoor Fire Accident, Apoorva Textile Showroom Apoorva Textile Showroom Fire Accident, Fire Accident in Andhra Pradesh

Fire Accident at Apoorva Textile Showroom in Chittoor District. Two Crores Rupees Damaged and Police suspect due to Watchman Disappear.

ITEMVIDEOS:చిత్తూరులో భారీ ఫైర్ యాక్సిడెంట్.. కుట్ర కోణం?

Posted: 08/11/2017 07:10 AM IST
Fire accident in chittoor cloth show room

చిత్తూరులో గురువారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చర్చి వీధిలోని అపూర్వ టెక్స్‌టైల్స్‌ షోరూం భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు అంతస్తులు కాలి బూడిదయ్యాయి. సుమారు ఆరు కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా.

అర్ధరాత్రి పోయాక మంటలు చెలరేగటం చుట్టుపక్కల ఉన్న స్థానికులు అగ్నిమాపక శాఖకు వెంటనే సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు ఎగసి పడడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

 

అయితే ఈ ప్రమాదం వెనక కుట్ర కోణం ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వాచ్‌మన్ రాత్రి నుంచి కనిపించకుండా పోవడంతో అతడి కోసం గాలిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Chittoor  Cloth Showroom  Fire Accident  

Other Articles