Just pay Rs 900 and own a diamond వజ్రం కావాలా నయానా.. రూ.900లే..

Diamonds in your means you can now own one for just rs 900 a month

diamonds, high quality diamonds, investing in diamonds, Indian commodity exchange, ICEX diamond SIP, systematic investment plan, Shares, mutual funds, markets, Gold, Diamond

You can now invest in high quality diamonds by investing as little as Rs 900 per month for 30 months,

నాణ్యమైన వజ్రాలు.. అత్యంత చౌకగా, సులభ వాయిదాల్లో..

Posted: 08/10/2017 08:02 PM IST
Diamonds in your means you can now own one for just rs 900 a month

లోహాలలో అత్యంత ఖరీదైన, మగువలు మెచ్చిన లోహం బంగారం.. ఇది ఎలా చెప్పారో రాళ్లలో అత్యంత విలువైన రాయి మాత్రం వజ్రమే. అదేనండీ డైమండ్స్.. అడపాదడపా టీవీల్లోని వాణిజ్య ప్రకటనల్లో చూడటమే తప్ప.. వాటి గురించి మాకేం పెద్దగా తెలియదు అంటారా..? అవునండీ మీరే కాదు.. మీ దాదాపుగా వజ్రాల గురించి తెలిసిన వారు దేశం మొత్తం మీదు ఇరవై శాతం మందికన్నా ఎక్కువ వుండరు. అయితే తాజాగా షేర్ మార్కెట్ తరహాలో వ్రజాల మార్కెట్ ను కూడా ప్రారంభించేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది.

దీంతో మ్యూచువల్ ఫండ్స్ తరహాలో ప్రతి నెల కొంత డబ్బును ఇచ్చి వాటిలో ఎలా పెట్టుబడులు పెడుతున్నారో.. అచ్చంగా అలానేు ఇకపై అదే సిస్టమెటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ప్రకారం ప్రతీ నెల వాయిదాల పద్దతిలో డబ్బను పెట్టుబడిగా పెట్టి.. మీకు కావాల్సిన వజ్రాన్ని మీరు సోంతం చేసుకోవచ్చు. నేరుగా సంస్థల నుంచి అందులోనూ హై క్వాలిటీ డైమండ్స్ పొందాలంటే ఏం చేయాలి. ఎక్కడ డబ్బులు పెట్టుబడిగా పెట్టాలి.. నెలకు ఎంత కట్టాలి అన్న సందేహాలు వున్నాయి కదూ.. అక్కడికే వస్తున్నాం.

నెలకు రూ.900 చెల్లించండి డైమండ్ ను మీ సొంతం చేసుకోండి అంటూ ప్రకటించింది ఇండియ‌న్ క‌మాడిటీ ఎక్స్‌చేంజ్ (ఐసీఈఎక్స్). అది కూడా కేవలం రెండున్నర ఏళ్లు చెల్లిస్తే చాలు. అంటే 30 నెలలు మాత్రమే. డైమండ్ ఫ్యూచ‌ర్స్ ట్రేడ్ కోసంఐసీఈఎక్స్ కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సూత్ర‌ప్రాయ అంగీకారం తెలిపింది. 30 సెంట్లు, 50 సెంట్లు,100 సెంట్లు( 1 క్యారెట్‌)ల‌తో మూడు డైమండ్ కాంట్రాక్టుల‌ను ప్రారంభించాల‌నుకుంటున్న‌ట్లు ఐసీఈఎక్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇందులో 30 సెంట్ల డైమండ్ ప్ర‌స్తుత ధ‌ర‌ల ప్ర‌కారం రూ.27 వేల‌కు వ‌స్తుంది.

ఇది ప్ర‌పంచంలోనే తొలి డైమండ్ ట్రేడింగ్ ఎక్స్‌చేంజ్‌గా నిల‌వ‌నుంది. దీనికోసం ఐసీఈఎక్స్ బ్రోక‌ర్ ద‌గ్గ‌ర ఓ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత మీ ఖాతాదారుడ్ని తెలుసుకో ప్ర‌క్రియ పూర్తి చేసి బ్రోక‌ర్ ద‌గ్గ‌ర కొంత డ‌బ్బు డిపాజిట్ చేయాలి. క‌చ్చితంగా ప్ర‌తి నెలా ఏ రోజున డైమండ్ కొనాలో కూడా బ్రోక‌ర్‌కు కొనుగోలుదారు చెప్పాల్సి ఉంటుంది. రీటెయిల్ డైమండ్ కొనుగోలుదారుల కోసం త్వ‌ర‌లోనే ఐసీఈఎక్స్ సిస్ట‌మెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ను ప్రారంభించ‌నుంది. ఇప్ప‌టికే మాక్ ట్రేడింగ్‌ను మొద‌లుపెట్టింది. ఆగస్టు చివ‌రిలోగా అస‌లు ట్రేడింగ్ మొద‌లుపెట్టాల‌ని ఐసీఈఎక్స్ భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles