Flag raising ceremony by a Monkey in Ambala భలా..! వానరం అవిష్కరించెను జాతీయ జెండా..!!

Monkey hoists the indian national flag on independence day in haryana

independence day, indian independence day, monkey hoisting indian national flag, 71st independence day, haryana, monkey hoisted national flag in haryana, monkey hoisted national flag in rajasthan, flag hoisting by monkey in Ambala, flag hoisting by monkey in Haryana, rajasthan, ajmer, pushkar, gayatri shakti peet, kanya vidyalay, school, Ambala, Haryana, monkeys

In a funny incident that took place on the occasion of India’s 71st Independence Day, in two different incidents monkeys hoisted the Indian flag as everyone surprised.

ITEMVIDEOS: భలా..! వానరాలు అవిష్కరించెను జాతీయ పతకాలు..!!

Posted: 08/16/2017 05:05 PM IST
Monkey hoists the indian national flag on independence day in haryana

భారత దేశం గొప్పతనాన్ని, దేశభక్తి గురించి చెప్పాలంటే.. పుటలు పుటలుగా చెబుతుంటారు. దేశంలోని అనువణువు దేశభక్తిని చాటుతుందని అంటారు. దేశంలోని ప్రతీ రాయి, రప్ప, చెట్టు, చేమ, పుట్ట, గాలి, నీరు, నిప్పు దేశభక్తిలోనూ వుంటాయని అంటారు. అయితే దేశంలోని జంతువులు కూడా దేశభక్తిని చాటుతాయని మీకు తెలుసా..? స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా అశ్వదళ సిబ్బంది.. డాగ్ స్వాడ్, ఇలా కొన్ని ఎంపిక చేసిన జంతువులు మాత్రమే మనకు కనబుతున్నా.. పూర్వం మాత్రం ఏనుగులు, ఒంటెలు. ఇలా అనేక జంతువులు కూడా తమ రాజాజ్ఞను పాటించి రాజ్యభక్తిని చాటుకున్నాయంటే అతిశయోక్తి కాదు.

తాజాగా దేశభక్తిని చాటకోవడంలో వనరాలు కూడా చేరిపోయాయి. అవునండీ ఇన్నాళ్లు దేశభక్తిని ప్రధాన కూడళ్లలో తన ట్రైనర్ అడించినట్టు అడి మాత్రమే చాటిన వానరాలు.. పరమపవిత్రమైన భారతావనిలో ఇక తాము స్వత్రంత్య జీవులమని చాటిచెప్పేందుకు స్వేచ్చంగా, స్వతంత్రంగా మన తివ్రర్ణ పతాకాన్ని ఎగురవేశాయి. అదేంటి అలా ఏలా చేశాయి అని అంటున్నారు కదూ. అయితే ఇది కేవలం ఒక్క చోట మాత్రమే జరిగింది కాదు. దేశంలో ఏకంగా రెండు రాష్ట్రాల్లో ఈ ఘటన జరిగింది. ఈ రెండు ఘటనలకు వేదికైంది మాత్రం పాఠశాలలే. పిల్లలు దేవుడితో సమానమంటారుగా అందుకనే కాబోలు ఏకంగా పాఠశాలల్లోని జాతీయ జెండాలను ఎగురవేసి.. మీకే కాదు మాకు స్వతంత్ర్యం వచ్చిందని సందేశాన్ని చాటాయి.

రాజస్థాన్ లోని అజ్మీర్ ప్రాంతంలోని పుష్కర్ పట్టణంలో గల గాయత్రి శక్తి పీఠం అధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాలికల పాఠశాలలో స్వత్రంత్య దినోత్సవ వేడుకలకు అంతా సిద్దం చేసి.. ఇక మరికొద్ది సేపట్లో జాతీయ పతాకావిష్కరణ చేస్తారన్న సమయంలో ఎక్కడి నుంచి ఈ వేడుకకు తాము ముఖ్యఅతిధులం అనుకుని వచ్చిన రెండు వనరాలు నేరుగా పతాకావిష్కరణ ప్రాంతానికి చేరకున్నాయి. ఒక్కటి కొంత దూరంలో నిల్చోగా, మరోకటి ఏకంగా పతాకానికి కట్టిన ముడిని విప్పి జాతీయ జెండాను అవిష్కరించింది.

దీంతో పాఠశాలలోని పిల్లలు కేరింతలు కొట్టడంతో పాటు చప్పట్లతో తమ అనందాన్ని వ్యక్త పర్చారు. ఇక రెండో ఘటనలో హర్యానా రాష్ట్రంలోని అంబాటాలో జరిగింది. ఒక్కడ కూడా స్థానిక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అంతా సిద్దం చేసిన తరుణంలో వచ్చిన రెండు వానరాలు ఏకంగా జాతీయ జెండాను అవిష్కరించి తమ దేశభక్తిని చాటుకున్నాయి. వానరాలు జాతీయ జెండాను అవిష్కరిస్తున్న క్రమంలో అక్కడి విద్యార్థులు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajasthan  ajmer  pushkar  gayatri shakti peet  kanya vidyalay  school  Ambala  Haryana  monkeys  

Other Articles