EPS orders judicial probe into Jayalalithaa's death అమ్మ మృతిపై జ్యూడీషియల్ విచారణకు సీఎం అదేశం..

Palaniswamy announced judicial probe into jayalalithaa s death

AIADMK, E Palaniswamy, O Panneerselvam, OPS, Poes Garden, Sasikala, judicial commission, J.Jayalalithaa, Tamil Nadu, TTV DInakaran

TN cm E Palaniswamy said that a judicial commission will probe the death of former chief minister J Jayalalithaa. The probe commission will be constituted under a retired judge, whose name will be announced later.

‘అమ్మ’ మృతిపై జ్యూడీషియల్ విచారణకు సీఎం అదేశం..

Posted: 08/17/2017 06:06 PM IST
Palaniswamy announced judicial probe into jayalalithaa s death

తమిళనాడు రాజకీయాలు మళ్లీ శరవేగంగా మారుతున్నాయి. అధికార పార్టీలో చక్రం తిప్పాలని భావించిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి. చిన్నమ్మ శశికళతో పాటు అమె మేనల్డుడు టీటీవి ధినకరణ్ కూడా చెక్ పెట్టి ఇక అనధికారికంగా అధికారంలో కొనసాగేందుకు కేంద్రంలోని అధికార బీజేపి పార్టీ ఇప్పటికే స్ర్కిప్టు సిద్దం చేసుకోగా, అందుకు అనుగూణంగానే పావులు కదుపుతుంది. అందులో భాగంగా మూడు ముక్కలుగా విడిపోయిన అధికార అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలను మళ్లీ ఏకం చేస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వానికి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించేలా చర్యలు తీసుకుంది తమిళానాడులోని పళనిస్వామి ప్రభుత్వం. పళని వర్గంతో జతకట్టేందుకు.. పన్నీరు సెల్వం డిమాండ్ చేస్తున్నట్లుగా జయలలిత మృతిపై జుడీషియల్ విచారణకు అదేశించిన ముఖ్యమంత్రి పళనిస్వామి.. రిటైర్డు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని అదేశించారు. ఇక పోయిస్ గార్డెన్ లోని వేద నిలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు శశికళ ప్రయత్నించడంతో ఇక వేదనిలయాన్ని జయలలిత స్మారక కేంద్రంగా మార్చేందుకు కూడా అదేశాలను జారీ చేశారు.

దీంతో పన్నీరు షరతులను అంగీకరించిన పళని స్వామి త్వరలోనే అయన ప్రభుత్వంలో చేరేందుకు ఈ మేర నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీతో పన్నీరు సెల్వం ఏకంగా అరగంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యి రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వివరించిన అనంతరం ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. అయితే తమిళులు మాత్రం అంతా కేంద్రం కనుసన్నల మేరకు జరగుతుందని.. నేరుగా ఉనికి చాటుకోలేక బీజేపి ఇలా పావులు కదపుతుందని వ్యాఖ్యానించడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles