భారత దేశానికి మర పదంగా హిందుస్తాన్.. ఆ దిశగా యావత్ ప్రపంచం గుర్తించే దిశగా అడుగులు సాగుతున్నాయి. భారతీయులు మరీ ముఖ్యంగా హిందువులు అత్యంత ప్రవిత్రంగా భావించే రామాయణం, మహాభారత ఇతిహాసాలను ఇక పాఠ్యాంశాలుగా మారనున్నాయి. ఎప్పటి నుంచో మన ఇతిహాసాలను మన విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోదిస్తున్నారుగా అని అంటారా..? అవునండీ మన ఇతిహాసాల్లోన్ని కొన్ని అంశాలను మాత్రమే మన విద్యార్థులు పాఠ్యాంశాలుగా నేర్చకుంటున్నారు.
కానీ పూర్తి ఇతిహాసాన్ని నేర్చుకోవాలంటే ఇక పురాణ గ్రంధాలను తీసి చదువుకోవాల్సిందే. అయితే ఏమైనా సందేహాలు ఉత్పన్నమైతే మాత్రం.. పండితులను, ఆచార్యులను మాత్రం అడగక తప్పదు. దేశీయ విద్యార్థులకే కాకుండా అగ్రరాజ్యవాసులకు కూడా ఇకపై మన ఇతిహాసలు పాఠ్యాంశాలుగా మారనున్నాయి. తొలిసారిగా ఈ అవకాశం అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ దక్కించుకోనుంది. రానున్న విద్యా సంవత్సరం నుంచి రామాయణ, మహాభారతాలను బోధించనున్నారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో దక్షిణాసియా మతాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్న అధ్యాపకురాలు యానీ ఈ మోనియస్ ఈ విషయాన్ని అదికారికంగా స్పష్టం చేశారు. ‘భారతీయ మత గ్రంథాల ద్వారా రచనా సాహిత్యాల బోధన’ అనే అంశాన్ని సిలబస్లో చేర్చారని, ఆధునిక మత పరిస్థితులకు అనుసంధానించి విద్యార్థులకు బోధిస్తారని చెప్పారు. ద్వేషం, యుద్ధం వల్ల కలిగే నష్టాలను మహాభారతం హుందాగా వివరించిందని తెలిపారు.
ఇక భారతదేశ ప్రేమ కథలు, పితృవాఖ్య పరిపాలన అంశంలో రామాయణం ఒకటని ఆమె అన్నారు. శతాబ్దానికి పైగా రామాయణ, మహాభారతాలను తాత్విక, లేఖన గ్రంథాలుగానే చాలా మంది పరిశోధకులు అధ్యయనం చేశారని ఆమె అభిప్రాయపడ్డారు. భారతీయ సాహిత్య సంపదను ఎక్కువగా విస్మరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత వీటి గొప్పదనాన్ని అభినందించకుండా ఉండలేరని యానీ ఈ మోనియస్ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more