కర్నూలు జిల్లా నంద్యాలలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఓ వైపు ప్రశాంత్ కిషోర్ పై కేసు పెడతామన్న లీకుల నుంచి తాజాగా నంద్యాల డీఎస్సీపై బదిలీ వేటు వరకు అంతా చర్చనీయాంశమే. ఈ పరిణామాలతో అప్పుడే అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయా.? అన్న విధంగా వాతావరణాన్ని మర్చేసింది. ఈ ఎన్నికలను అధికార టీడీపీ, విపక్ష వైఎస్సార్ సిపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలలో పరస్పర దూషణలు, అరోపణలు, విమర్శలే కాకుండా వ్యూహాత్మక దాడులు కూడా కొనసాగుతున్నాయి.
ఎన్నికల నోటిపికేషన్ విడుదలైన నాటి నుంచి ఈ రెండు వర్గాల నేతలు, కార్యకర్తలు మొదలు అన్ని స్థాయిలలో వైరంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పరస్పరం ఎన్నికల కమీషన్ అధికారులకు పిర్యాదులు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విపక్షానికి చెందిన వైఎస్సార్ సిపీ పార్టీకి చెందిన దిగువ శ్రేణి నాయకులను బెదిరించి. ప్రలోభాలకు గురి చేసి వారిని తమ వెంట తీసుకెళ్లేందుకు అధికార పార్టీ వ్యూహాలు రచిందిందని కూడా విఫక్షం అరోపణలు చేసింది.
ఇక ఇటు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుని అధికార టీడీపీ.. తమ పార్టీకి చెందిన నాయకులను టార్గెట్ చేస్తున్నారని విపక్షానికి చెందిన పార్టీ నేతల నుంచి పిర్యాదులు వెల్లువెత్తడంతో.. ఎన్నికల కమీసన్ స్పందించింది. విపక్ష సభ్యులతో పాటు ఎన్నికల అబర్వర్లు నుంచి కూడా నివేదికలను తీసుకున్న తరువాత ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి.. వారి అదేశాల ప్రకారం నంద్యాల డీఎస్సీ గోపాల కృష్ణపై సప్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్నాచితకా నాయకుల ఇళ్లపై అర్థరాత్రి సోదాలు అంటూ తలుపు తడుతూ డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుని అతనిపై చర్యలను తీసుకుంది. గోపాలకృష్ణ స్ధానంలో ఓఎస్డీ రవిప్రకాశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈసీ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముగ్గురు పరిశీకులను ఈసీ నియమించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more