ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో అక్సిజన్ సిలిండర్ల కోరతతో చిన్నారుల మరణం సంభవించలేదని ఏకంగా అధికార యంత్రాంగం నివేదిక వెల్లడించినా.. ఇంకా అదే కారణంగా నూరేళ్ల జీవితాన్ని అనుభవించాల్సిన భావిభారత పౌరులు పదేళ్లు కూడా నిండి నిండకుండానే చిన్నారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలుస్తున్నాయి. మరెందరో చిన్నారుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి.
బీఆర్డీ అస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారుల్లో ఈ నెల 10 నుంచి 11 వరకు 48 గంటల్లో 30 మంది ఆక్సిజన్ అందక మృతిచెందడం విషయం వెలుగుచూడడంతో సంచలనంగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చిన్నారుల మృతిపై చర్యలు తీసుకుంది. కమిటీని వేసి చిన్నారుల మృతికి కారణాలను వెలికి తీయాలని అదేశించింది. అయితే ఓ వైపు కమిటీ తన విచారణ సాగిస్తున్నా.. ఇటు చిన్నారుల మరణాలు మాత్రం అగడం లేదు. బీఆర్డీ అస్పత్రిలో చిన్నారుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో నిత్య విషాదం ప్రాంతంగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో విపక్షాలకు చెందిన పార్టీ నేతలు ఆస్పత్రికి చేరుకుని మృతిచెందిన చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. వైద్యుల పనితీరుపై, అక్సిజన్ కాంట్రాక్టులో అవకతవంకలపై విమర్శలు చేస్తున్నారు. అయినా అస్పత్రి వర్గాల్లో మాత్రం ఏమాత్రం మార్పు కనపించడం లేదు. గడిచిన 24 గంటల్లో మరో 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆ ఆసుపత్రి వైద్యులు ప్రకటించడం కూడా ఒక కారణంగా మారింది. దీంతో భీఆర్డీ అస్పత్రిలో ఇప్పటివరకు మృతిచెందిన చిన్నారుల సంఖ్య 105కి చేరింది. ఈ 11 మంది చిన్నారులు నియోనాటల్ (నవజాత శిశువు), ఏన్సెఫలైటిస్ (మెదడు వాపు వ్యాధి), సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more