6 Coaches Of Duronto Express Derail Near Thane పట్టాలు తప్పిన మరో రైలు.. పక్షంలో నాలుగో ఘటన..

Six bogies of nagpur mumbai duronto express derails near asangaon

Asangaon, Central Railway, Duranto accident, duranto Express derailment, Duronto Express, India, Indian Railways, Kaifiyat Express, Maharashtra, Nagpur-Mumbai Duronto derails, Nagpur-Mumbai Duronto Express, Nagpur-Mumbai train derailed, Railway accident, Train accident, train accident today, Utkal express

Six bogies of the Nagpur-Mumbai Duronto Express have derailed near Asangaon, on the outskirts of Thane, on Tuesday. No casualty has been reported so far.

ITEMVIDEOS: పట్టాలు తప్పిన మరో రైలు.. పక్షంలో నాలుగో ఘటన..

Posted: 08/29/2017 09:48 AM IST
Six bogies of nagpur mumbai duronto express derails near asangaon

ఉత్తర్ ప్రదేశ్ లో 23 మంది ప్రయాణికుల ప్రాణాలను బలితీసుకున్న ఘోర రైలు ప్రమాదఘటనకు తాలుకు జ్ఞాపకాలు కళ్లు ముందునుంచి ఇంకా చెదిరిపోకముందే.. తాజాగా మహారాష్ట్రలో మరో రైలు పట్టాలు తప్పడంతో.. ప్రయాణికులలో అందోళన రేకెత్తుతుంది. వరుసగా రైళ్లు పట్టాలను తప్పడం ఘటనలు.. ఎలా సంబవిస్తున్నాయన్న విషయాన్ని పక్కనబెడితే.. ఇక రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు మాత్రం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని రైలుబండి ఎక్కల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

ఇవాళ ఉదయం మహారాష్ట్రలో మరో రైలు ప్రమాదానికి గురైంది. నాగ్‌పూర్‌ నుంచి ముంబయి వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం ఉదయం 6.40 గంటల ప్రాంతంలో థానే జిల్లాలోని ఆసాన్‌గావ్‌ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, పలువురికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయని సెంట్రల్‌ రైల్వే అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. పోలీసులు, సహాయక సిబ్బంది ప్రయాణికులను బోగీల నుంచి సురక్షితంగా బయటికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లతో పాటు లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు వెల్లడించారు.

ఘటనాస్థలం నుంచి ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు రైల్వే అధికారులు వారికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా వున్నందున ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని అధాకారులు తెలిపారు. ఘటనాస్థలానికి సీనియర్ రైల్వే అధికారులతో పాటు వైద్యులను కూడా పంపించామని సెంట్రల్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదం నేపథ్యంలో లోకల్ రైళ్లు కల్యాణ్ వరకు మాత్రమే నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు.

వరుస ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ స్థానంలో లోహనిని నియమించిన వారం రోజుల వ్యవథిలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. కాగా దురంతో ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటన దురదృష్టకరమని అయితే ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా వున్నారని, బాధితుల కోసం రైల్వే ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశామని రైల్వే శాఖ అధికార ప్రతినిధి అనీల్ సక్సేనా చెప్పారు.

కేవలం పక్షం రోజుల వ్యవధిలో నాలుగు రైళ్లు పట్టాలు తప్పడంపై రైల్వేశాఖ అధికారుల తీరుకు దర్పణం పడుతుందన్న విమర్శలు వినబడుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రాతినిథ్యం వహిస్తున్న మహారాష్ట్రలోనే రెండు ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. నాలుగు రోజుల క్రితం ముంబయిలో ఓ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మొన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో కైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలో వంద మందికి పైగా గాయపడ్డారు. అంతకుముందు అదే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ 14 కోచ్‌లు పట్టాలు తప్పడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles