గత కొన్ని నెలలుగా సాగుతున్న డోక్లామ్ వివాదానికి తెరపడిందనుకున్న సమయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. భారత్- చైనాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చల్లో భాగంగా రెండు దేశాల తమ బలగాలను డోక్లామ్ నుంచి ఉపహరించుకోవడానికి అంగీకరించిన డ్రాగన్ దేశం.. తన వక్రబుద్దిని ప్రదర్శించి.. డోక్లాంలో తమ గస్తీ మాత్రం కోనసాగుతుందని, కేవలం భారత మాత్రమే సైనికులను ఉపసంహరించుకుంటారని ప్రకటించింది.
ఇలా ప్రకటన చేసిన మరికోద్ది గంటల వ్యవధిలోనే డోక్లాం నుంచి పూర్తిగా తమ సైనికులను వెనక్కు రప్పించుకుంది. ఈ క్రమంలో డోక్లాం నుంచి చైనా బుల్ డోజర్లు వెనక్కి వెళ్లిపోయాయని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డోక్లాంలో వివాదానికి కారణమైన రహదారి నిర్మాణం ఆగిపోయిందని భారత్ చెబుతోంది. బుల్ డోజర్లు, నిర్మాణ పరికరాలు వెనక్కి వెళ్లిపోయాయని భారత్ తెలిపింది. ఇన్నాళు భారత్ పై తమదే పై చేయి అని తన మీడియాలో చాటింపు వేయించుకున్న డ్రాగన్.. చివరకు సయోద్యకు తలొగ్గింది.
భారత్ పై తమ మీడియాలో విష ప్రచారం చేయించుకున్న డ్రాగన్.. ఎన్నో రకాలుగా భారతీయుల సంయమనాన్ని, సహనాన్ని పరీక్షించేందుకు అనేక యత్నాలు చేసినా.. అవి ఫలించకుండా.. భారత్ కూడా సమర్థవంతంగా అడుగులు వేసింది. కాగా చైనా తోకముడుచుకుని వెనక్కి వెళ్లడం భారత్ విజయమేనంటూ నెట్ జనలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చతురతను ప్రతిపక్ష నేతలు కూడా కోనియాడుతున్నారు. సరిహద్దు వివాదానికి ముగింపు పలకాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు సోనియా, మన్మోహన్ అభినందనలు తెలిపారు.
దీనిపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన ట్విట్టర్ ద్వారా ‘దుందుడుకు చర్యలకు పాల్పడకుండానే చైనాపై భారత్ పైచేయి సాధించింది. ప్రధాని మోదీకి, ఆయన బృందానికి అభినందనలు’ అని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా కేంద్ర ప్రభుత్వం డోక్లాం వివాదంలో చూపిన చతురతను అభినందించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ద్వారా ‘డోక్లాం వివాదం సద్దుమణగడాన్ని స్వాగతిస్తున్నాం. పొరుగుదేశాలతో సఖ్యత పెంపెందించుకోవడంపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టాలి’ అని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more