తన అర్థాంగి (తనలో సగం)పై అనుమానం పెంచుకున్న భర్త.. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించి.. కటకటాలపాలయ్యాడు. భార్యపై అనుమానం పరాకాష్టకు చేరడంతో అమెను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా శీల పరీక్ష కూడా నిర్వహించిన వైనం వెలుగులోకి రావడంతో ఆ క్రూరమృగాన్ని పోలీసులు అరెస్టు చేశారు. భర్తతో కలసి కాపురం చేయాలని కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులకు.. అతను చేసిన అకృత్యాలను వెల్లబోసుకునేసరికి పోలీసులే నిర్ఘాంతపోయారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ కు చెందిన పాతికేళ్ల ప్రియాంక, వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన రవితో 2005లో వివాహం కాగా, వారికి ఇద్దరు పిల్లలు వున్నారు. పెళ్లైన తరువాత రవికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వర్థన్నపేట నుంచి ఘట్ కేసర్ మండలం పోచారం పంచాయతీ పరిధిలోని అన్నోజిగూడలో కాపురం పెట్టారు. తాను డ్యూటీకి వెళ్లినప్పుడు తన భార్యత అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించి మనోవేదనకు గురిచేశావాడు.
ఈ వేదింపులకు చివరకు ప్రియాంక జననాంగాలపై కత్తిగాట్లు దాటి.. అమెను శీల పరీక్ష చేయించుకోమ్మనే స్థాయికి వెళ్లాయి. దీంతో భర్త వేధింపులను తాళలేని ఆమె ఇటీవల పుట్టింటికి వెళ్లినా.. అమెపై అక్కడే దాడి చేసి.. ఇంటికి తీసుకోచ్చాడు. పదిరోజుల మామూలుగానే వున్న రవి మళ్లీ వేదింపులకు పాల్పడ్డాడు. భర్త చర్యలను తట్టుకోలేని ప్రియాంక ఈ నెల 24న పిల్లలతో కలసి బంధువుల ఇంటికి వెళ్లింది. తన భార్య అచూకీ తెలియడం లేదన్న రవి పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అమె జనగాంలో ఉన్నట్లు గుర్తించారు.
అక్కడి నుంచి తమ పోలీస్ స్టేషన్ ను తీసుకువచ్చిన ఘట్ కేసర్ పోలీసులు.. అమెకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. భర్తతో కలసి సుఖంగా సంసార జీవనాన్ని గడపాలని సూచించారు. ఇకపై మీ భర్త అనుమానించడని కూడా చెప్పారు. పోలీసులు బలవంతం పెట్టడంతో తట్టుకోలేకపోయిన ప్రియాంక తనకు భర్తతో కాపురం ఇష్టం లేదని తెగేసి చెప్పింది. భర్త చేసిన అకృత్యాలను ఘట్ కేసర్ పోలీసులు దృష్టికి తీసుకురావడంతో.. నిర్ఘాంతపోయిన పోలీసులు.. అమె భర్తపై కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more