అవును మీరు చదవిని శీర్షక నూటికి నూరుపాళ్లు కరెక్టే. ఎందుకంటే ఇది నిజంగా హెచ్చరికే. కేంద్ర ప్రభుత్వ సంస్థ జారీ చేసిన హెచ్చరిక. ఈ హెచ్చరికను మీరారంటే.. ఇక మీ బేబులకు భారీగా చిల్లులు పడవచ్చు. ఏమిటీ హెచ్చరిక అంటున్నారా..? ఎవరి జారీ చేశారని అడుగుతున్నారా..? కేంద్ర అదాయ పన్ను శాఖ అధికారులు దేశ ప్రజలకోసం జారీ చేసిన హెచ్చరిక. గత ఏడాది నవంబర్ 8న అమల్లోకి వచ్చిన పాత నోట్ల రద్దు నేపథ్యంలో తెరపైకి వచ్చిన నగదు రహిత లావాదేవీల విషయంపైనే ఈ హెచ్చరిక.
ఇకపై దేశప్రజలు ఏవ్వరూ రెండు లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు చేస్తే వారికి భారీగా అపరాధ రుసుము వసూలు చేయబడుతుంది. ఈ మేరకు అదాయ పన్ను శాఖ అధికారులు ఓ బహిరంగ ప్రకటనను వెలువరించారు. దీని ప్రకారం రూ. 2లక్షలకు మించి నగదు లావాదేవీలు జరపటం చట్టవిరుద్దం. ఇకపై ఇలాంటి లావాదేవీలకు పాల్పడితే భారీగా జరిమానా వసూలు చేస్తామని ప్రకటనలో పేర్కోంది. కేంద్ర ప్రభుత్వం ఈ అర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో తీసుకువచ్చిన ప్రత్యేక అర్థిక బిల్లులో ఈ విషయాలను పోందుపర్చింది.
దీంతో ఇకపై రూ. 2 లక్షలకు పైగా నగదు లావాదేవీలు జరిపిన పక్షంలో చట్టప్రకారం జరిమానా తప్పదని పేర్కోంది. ఒక్కరోజులో ఒక వ్యక్తి నుంచి రూ. రెండు లక్షలకు మించి ఒక్క లావాదేవీలో కానీ లేక పలు లావాదేవీలలో కానీ నిర్వహించరాదు. ఇది ఏ ఒక్క సందర్భంలోనైనా, లేక కార్యక్రమానికి సంబంధించినా లావాదేవీయైనా రెండు లక్షలకు మించరాదని పేర్కొనింది. రూ.2లక్షలకు మించి నగదు లావాదేవీలను నిర్వహించడం నిషిద్దమని ప్రకటనలో పేర్కోనింది. స్థిరాస్తి బదిలీ కోసం రూ.20 వేలకు మించి నగదు తీసుకోవడం కానీ, ఇవ్వడం కానీ చేయరాదు.
వృత్తిపరమైన, వ్యాపారపరమైన ఖర్చులు రూ.10 వేలకు మించి నగదు రూపంలో చెల్లించరాదని అదాయ శాఖ ప్రకటించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవు. నగదు రహిత లావాదేవీలు జరపండి. పారదర్శకంగా ఉండండి అని సూచిస్తుంది. అలాంటి ఉల్లంఘనలకు ఎవరైనా పాల్పడుతుంటే ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ కు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించాలని ఆ ప్రకటనలో పేర్కొంది. బడ్జెట్లో భాగంగా చేసిన చట్టసవరణ ద్వారా ఏప్రిల్ 1 నుంచి రెండు లక్షల నిబంధన అమల్లోకి వచ్చింది. ఆదాయ పన్ను చట్టంలో చేర్చిన 269 ఎస్టీ నిబంధన ప్రకారం… రూ.2 లక్షల నిబంధన ఉల్లంఘించిన వారికి వందశాతం జరిమానా వేస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more