ఉత్తర్ ప్రదేశ్ లో ఓ వైపు పోలీసులు, మరో వైపు మోరల్ పోలిసింగ్ వ్యవస్థలు పటిష్టంగా వుండటం.. వీటిని పక్కనబెడితే.. గ్రామాలలో ఇప్పటికీ కొనసాగుతున్న అనాగరిక శిక్షలు ఆ యువకుడ్ని అతని ప్రియురాలిని దూరం చేసింది. తనకు ఇష్టమైన ప్రియుడిపై అతని ప్రియురాలు తీవ్రమైన ఒత్తిడిని తీసుకువచ్చినా అతను అమెతో కలసి ఇంట్లోంచి లేచిపోయేందుకు నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మైనర్ బాలిక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని అగ్నికి అహుతైంది.
సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజాఫర్ నగర్ ప్రాంతంలోని షాఫ్పూర్ ఏరియాకు చెందిన 15 ఏళ్ల బాలికకు స్థానికంగా వుండే ఓ 20 ఏళ్ల కుర్రాడితో చనువుగా వుంది. అది క్రమంగా ప్రేమగా రూపాంతరం చెందింది. ఆ ప్రణయం శాశ్వతం చేసుకోవాలని అమె తన తల్లిదండ్రులతో విషయాన్ని చెప్పింది. అందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో తన ప్రియుడితో కలసి లేచిపోదామని కోరింది. అయితే గ్రామాలలో కొనసాగుతున్న అనాగరిక శిక్షల నేపథ్యంలో యువకుడు నిరాకరించాడు.
అయినా సరే ఏమీ కాదని.. తమ తల్లిదండ్రులు తాము చేసిన చర్యతో దారికి వచ్చి తమ పెళ్లికి సమ్మతిస్తారని కూడా చెప్పింది. అయినా సభ్యసమాజంలో జరుగుతున్న నేరాల నేపథ్యంలో బాలిక ప్రియుడు వెనుకంజ వేశాడు. పదే పదే అమె చెప్పినా.. అందుకు యువకుడు సమ్మతించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక అటు తల్లిదండ్రులు తమ మాటను లక్ష్యపెట్టడం లేదు.. ఇటు ప్రియుడు కూడా తన మాట వినిపించుకోవడం లేదని కలత చెంది.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలపాలై మృతిచెందింది. దీంతో ప్రియుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్గం నిమిత్తం తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more