ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన వ్యాఖ్యనంతో అందిస్తూ.. సిరీస్ గా అప్రతిహాతంగా సాగుతూ సంచలనాలకు మారు పేరుగా నిలిచిన షో.. కౌన్ బనేగా కోరడ్ పతి. అయితే అమితాబ్ బచ్చన్ లేకుండా.. ప్రయాసపడి టీవీ స్టూడియోల చూట్టూ తిరగాల్సిన పనిలేకుండా మీరు ఈ పోటీలో పాల్టోనేందుకు సిద్దమా..? ఇంట్లోనే కూర్చోని మీరు ఈ ఆత్మవిశ్వాసంతో ఈ ఆటను అడగలరా..? అయతే మీకు రిలయన్స్ జియో బ్రహ్మిండమైన ఆపర్ ప్రకటించింది.
అయితే ఇది పూర్తిగా జియో కస్టమర్లకు మత్రమే పరమితం.. తన కస్టమర్లకు అఫర్లను అందజేయడంలో ముందున్న జియో.. ‘కౌన్ బనేగా కరోడ్ పతి-2017’ను ఇంట్లోనే కూర్చుని ఆడే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. టీవీలో షో జరుగుతున్నప్పుడు దానిని చూస్తూ ఆన్‌లైన్‌లో ఆడాల్సి ఉంటుంది. అక్కడ హాట్ సీట్ మీద కూర్చున్న కంటెస్టెంట్ కంటే ముందే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇందుకోసం తొలుత జియో చాట్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేబీసీలోకి లాగిన్ అయి ఎంచక్కా ఆడేసుకోవడమే.
గేమ్ ఆడే సమయంలో కనిపించే నాలుగు ఆప్షన్ల నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకుని హాట్ సీట్‌లో ఉన్న వ్యక్తి కంటే ముందే పంపాల్సి ఉంటుంది. సమాధానం సరైనదైతే కంటెస్టెంట్‌తోపాటు రెండో ప్రశ్నకు వెళ్లిపోతారు. తప్పుగా చెబితే మాత్రం అక్కడే ఆగిపోతారు. కావాలనుకుంటే మళ్లీ వేరే వాళ్లతో మొదలయ్యే రౌండ్ నుంచి మళ్లీ ఆడుకోవచ్చు. చెప్పిన సమాధానాలను బట్టి అమితాబ్ బచ్చన్ ఆ తర్వాతి రోజు విజేతలను ప్రకటిస్తారు.
ఇందుకోసం కేబీసీతో జియో ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఘర్ బేటీ జీతో’ పేరుతో వస్తున్న ఈ ప్రత్యేక సదుపాయం జియో వినియోగదారులకు మాత్రమే. ఒకవేళ జియో వినియోగదారులు కానివారు ఆడాలనుకుంటే జియో చాట్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఎంపిక చేసిన విజేతలకు డాట్సన్ రెడిగో కారును బహుమతిగా అందిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more