యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంలో బక్రీద్ ను కొత్తగా జరుపుకుంటున్నారు. సంభల్ ప్రాంతంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ జంతు వధపై నిషేధం విధిస్తూ.. గ్యాంగ్ స్టర్ యాక్ట్ ను ప్రయోగిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. నిబంధనలను దిక్కరిస్తూ ఎవరైనా ఆవు, ఎద్దు, దున్నపోతు, ఒంటెలను బలి ఇస్తే వారిపై జైల్లో పెట్టడానికి కూడా కారణాలు అక్కర్లేదని ఆయన హెచ్చరించారు కూడా. ఇదే రీతిలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఆదేశాలే ఇచ్చారు.
ఇక బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనల తర్వాత ఆత్మీయ ఆలింగనాలు, కరచాలనాలకు దూరంగా ఉండాలని ఉత్తర ప్రదేశ్ ముస్లింలకు మత పెద్దలు సూచించారు. రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతున్న హెచ్1ఎన్1 స్వైన్ ఫ్లూ వ్యాప్తిని కట్టడి చేయడానికి వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న 75 జిల్లాల్లో 66 జిల్లాల్లో ఇప్పటికే 2,300 మంది స్వైన్ ఫ్లూ బారిన పడినట్లు సమాచారం. వారిలో 53 మంది వరకు మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. `ఈ ఒక్క ఏడాది సంప్రదాయ ఆలింగనాలను వదిలేయాలని ముస్లింలను మేం కోరుతున్నాం` అని సున్నీ మతపెద్ద మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ మీడియాతో అన్నారు.
యూపీ జనాభాలో 4 కోట్ల మంది ముస్లింలు ఉండగా వారు మాత్రం ఈసారి కాస్త విభిన్న రీతిలోనే బక్రీద్ ను జరుపుకుంటున్నారు. పండుగ సందర్భంగా పాటించే సంప్రదాయాల వల్ల మత విధానాలు దెబ్బతింటున్నాయని ఓ మత పెద్ద వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more