ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో వర్గపోరు విజయవాడలో ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వైసీపీ నేత గౌతం రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపటంతో.. వైసీపీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
వంగవీటి రంగా హత్యను ఆయన సమర్థిస్తూ ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. వంగవీటి రంగా, రాధలను చంపడం దారుణమని ఎందుకంటారని, రౌడీ రాజకీయాలే పరమావధిగా ముందుకెళ్లే వారు పోస్టుమార్టానికి వెళ్లాల్సిందేనని గౌతంరెడ్డి అన్నారు. ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఓ కథ కూడా చెప్పారు.
ఓసారి ఓ పాము కనిపించిన వారినందరినీ కాటువేసుకుంటూ వెళ్తూ చివరికి ఓ దేవుడి ఫొటో వెనక దాక్కుందని, కానీ తమను కాటువేసిన పాము దేవుడి ఫొటో వెనక దాక్కుంది కాదా.. అని జనాలు చంపడం మానేస్తారా? అని ప్రశ్నించారు. నిరాహార దీక్షలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా రౌడీ రాజకీయాలు చేసే వారి భవిష్యత్ పోస్టుమార్టమేనంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రౌడీ రాజకీయాలు వదిలి తమలాగా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వాళ్లు వచ్చిన తర్వాతే కుల రాజకీయాలు బయటకు వచ్చాయని ఆరోపించారు. వారు ఈ కులం వారిని చంపితే, వారు ఈ కులం వారిని చంపడం మొదలుపెట్టారని గౌతం రెడ్డి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
వైరల్.. తీవ్ర ఉద్రిక్తత...
వంగవీటి రాధతో గౌతంరెడ్డికి అస్సలు పడదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాధ మరణంపై గౌతం చేసిన వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయవాడ భగ్గుమనడానికి కారణమయ్యాయి. చివరికి రాధా, ఆయన తల్లి రత్నకుమారి అరెస్ట్‌కు దారి తీశాయి. ఆపై ఆయనకు ఆ పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. ఈ సందర్భంగా వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ, పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు ఏ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు చెప్పారు.
వైఎస్ జగన్ సీరియస్...
వైఎస్ రాజశేఖరరెడ్డికి వంగవీటి రంగా మంచి స్నేహితుడని, వంగవీటి రంగాను తాము ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటామని అన్నారు. అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్ గౌతంను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి రాధ, రంగాలపై గౌతంరెడ్డి వ్యాఖ్యలు సరికాదని, అనవసర వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని జగన్ పేర్కొన్నారు. కాగా, కడప జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన వైఎస్ జగన్ ఈ రోజు రాత్రి పార్టీ నాయకులతో ఈ అంశంపై చర్చించారు. గౌతంరెడ్డి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా కమిటీని జగన్ ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more