అనూహ్య నిర్ణయాలు తీసుకునే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ లోనూ అదే పంథాను కొనసాగించారు. పాత వాళ్లకి మార్చిన శాఖలతోపాటు కొత్త మంత్రులకు ఊహించని రీతిలోనే శాఖలు కేటాయించారు. నలుగురు మంత్రులపై నమ్మకంతో కీలక బాధ్యతలను ప్రమోషన్ లో భాగంగా అప్పగించినట్టు సమాచారం. అన్నింటికి కన్నా హైలెట్ నలుగురు నిజాయితీపరులుగా పేరున్న మాజీ బ్యూరోక్రట్ లకు మంత్రి వర్గంలో చోటు కల్పించటం. ఆపై నిర్మలా సీతారామన్ కు కీలకమైన రక్షణ శాఖను అప్పగించించటం, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనంతకుమార్ హెగ్డేకు కూడా కేబినెట్ లో సహయ మంత్రిగా బెర్తు దక్కటం.
సురేష్ ప్రభు తప్పుకునేందుకు సిద్దం కావటంతో పీయూష్ గోయల్ కు రైల్వే శాఖ, ధర్మేంద్ర ప్రదాన్ కు పెట్రోలియం శాఖ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి మైనార్టీ సంక్షేమ శాఖలను అప్పగించారు. ఇప్పటి వరకు రైల్వే మంత్రిగా ఉన్న సురేష్ ప్రభుకు కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ, నితిన్ గడ్కరీకి జలవనరుల శాఖను అప్పగించనున్నట్టు సమాచారం. కొత్తగా కేంద్రమంత్రి బాధ్యతలు చేపట్టిన హర్దీప్ సింగ్ కు వాణిజ్య పన్నుల శాఖ సహాయ మంత్రి బాధ్యతలు కట్టబెట్టారు.
నిర్మలా అరుదైన రికార్డు...
రక్షణ శాఖామంత్రిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ (58) చరిత్ర సృష్టించారు. 2014 నుంచి బీజేపీ అధికార ప్రతినిధిగా, వాణిజ్య శాఖ సహాయమంత్రిగా ఉన్న ఆమెను ప్రధాని మోదీ ఏకంగా కీలకమైన రక్షణ శాఖను అప్పగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించిన సీతారామన్ ఆ శాఖను నిర్వహిస్తున్న రెండో మహిళగా చరిత్రకెక్కారు. గతంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉంటూనే రక్షణ శాఖను చూసేవారు.
అయితే ఆ శాఖ భాద్యతలు పూర్తిస్థాయిలో చేపట్టిన తొలి మహిళ మాత్రం నిర్మలనే. ఇక మోదీ కేబినెట్‌లో కీలక పదవుల్లో ఇద్దరు మహిళలు ఉండడం గమనార్హం. సుష్మాస్వరాజ్ విదేశీ వ్యవహారాలు చూస్తుండగా, ఇప్పుడు నిర్మల ఏకంగా రక్షణ మంత్రి పదవి చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ యుద్ధ రంగంలోకి మహిళలను తీసుకోవడంపై దృష్టి సారించనున్నట్టు తెలిపారు.
తెలుగు స్టేట్స్ కు హ్యాండ్...
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి ఎదురైంది. 9 కొత్త ముఖాలకు స్థానం కల్పించినప్పటికీ తాజా విస్తరణలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ స్థానం కల్పించకపోవడం గమనార్హం. మంత్రి పదవి ఊహాగానాల నేపథ్యంలో కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు నిరాశ ఎదురైంది. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్థానంలో వెదిరె శ్రీరామ్ లేదా మురళీధర్ రావును తీసుకుంటారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయనది కూడా సేమ్ పరిస్థితి.
కేబినెట్ మినిస్టర్ గా ఉన్న వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ప్రమోట్ కావడం.. కేంద్ర మంత్రి పదవి నుంచి బండారు దత్తాత్రేయకు ఉద్వాసన పలకడంతో రెండు తెలుగు రాష్ట్రాలు రెండు మంత్రి పదవులను త్యాగం చేశాయి. వీరి స్థానంలో ఒక్కరికైనా స్థానం కల్పిస్తారని ఆశించారు. అయితే అందరి ఆశలు అడియాసలు చేస్తూ ఎవరికీ పదవులు దక్కలేదు. దీంతో కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఏపీ నుంచి తెలుగు దేశం తరఫున అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి మంత్రులుగా ఉండగా, తాజాగా మంత్రి వర్గ విస్తరణలో ఏపీతో సంబంధం ఉన్న నిర్మలా సీతారామన్ కు కీలకమైన రక్షణ శాఖ అప్పగించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more