Road rage: Gurgaon woman arrested for slapping jawan జవానుపై జులుం.. మహిళ అరెస్టు.. వీడియో వైరల్..

Gurgaon woman who slapped army jawan in road rage arrested

gurgaon woman slaps army jawan road rage delhi vasant kunj, delhi, army, men,officer,beaten,beating,fight,slapping,slap,women,car, youtube, army men beaten by women, women slap jawan, jawan, women slap army officer, hiting, hitting ,truck, lady beating army officer

Delhi Police arrested the Gurgaon woman, hours after her video slapping an Army jawan repeatedly in Vasant Kunj area, went viral.

ITEMVIDEOS: జవానుపై జులుం.. మహిళ అరెస్టు.. వీడియో వైరల్..

Posted: 09/16/2017 11:21 AM IST
Gurgaon woman who slapped army jawan in road rage arrested

భార్యపిల్లలకు దూరంగా, తల్లిదండ్రులకన్నా దేశం, దేశ ప్రజలే ముఖ్యమని భావించి దేశ రక్షణలో తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా త్యాగం చేసే జవాన్లను మనకు ఎక్కడ కనిపించినా వారికి రెండు చేతులను ఒక్క జోడించి ప్రణామాలు చేయడం లేదా.. కరతాళ ధ్వనుల చేత వారికి స్వాగతించడం వల్ల దేశం కోసం తాము మరింత అధికంగా సేవ చేసినా తప్పులేదని భావన వారిలో కలుగుతుందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పిన ఢిల్లీలోనే ఓ జవానుకు పరాభవం ఎదురైంది.

విధి నిర్వహణలో ఉన్న ఓ జవాన్ పై స్థానిక మహిళ దాడి చేసి తన జులుం ప్రదర్శించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మహిళ జవాను చెంప పగలకొట్టిందన్న వార్త దవాణంలో సామాజిక మాద్యమాల్లో ప్రసారం కావడంతో అలస్యంగా స్పందించిన పోలీసులు సదరు మహిళను అలస్యంగా గుర్తించి.. అరెస్టు చేశారు. దీంతో విషయం కాస్తా వార్తగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని గుర్గావ్ లో ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎందుకింతలా వైరల్ అంటే.. సర్వసాధారణంగా అర్మీ వాహనానికి ఏ వాహనం అడ్డుగా వెళ్లినా.. లేక వారు అడ్డుగా వచ్చిందని భావించినా అర్మీ సిబ్బంది రో్డుపైనే వారిని చితకబాదిన ఘటనలు అనేకం వున్నాయి, కానీ అర్మీ జవానునే మహిళ కొట్టడంతో ఇదికాస్తా వైరల్ అయ్యింది.

ఢిల్లీకి చెందిన 44 ఏళ్ల మహిళ స్మృతి కల్రా భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు. గత శనివారం మధ్యాహ్నా సమయంలో తన టాటా ఇండికా కారులో బయటకు వెళ్లారు. ఇంతలో తన ముందు వెళ్తున్న అర్మీ వ్యాను తన కారుకు అడ్డంగా వచ్చిందని భావించిదో లేక హారన్ కొడుతున్నా అర్మీ వ్యాన్ నుంచి స్పందన రాలేదో తెలియదు కానీ.. కోపం నషాలానికి ఎక్కిన మహిళ అర్మీ వ్యానును ఓవర్ టేక్ చేసి అడ్డుగా నిలిపింది. కారు దిగి అంతే వేగంగా నడుచుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న ఓ జవాన్‌ చెంప పగలకొట్టారు. అతను మాట్లాడే లోపే మరో రెండు.. మూడు దెబ్బలు చరిచి ఆమె తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
అక్కడే పక్కనే కారులో ఉన్న మరో వ్యక్తి అదంతా తన మొబైల్ ఫోన్ లో నిక్షిప్తం చేసి సామాజిక మాద్యమంలో అప్‌ లోడ్ చేశాడు.  ఈ విషయమై అర్మీ వర్గాలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. వెంటనే జడ్జి స్మృతికి బెయిల్‌ మంజూరు చేశారు. ఈ ఘటనపై జవాను స్పందిస్తూ.. అమె ఒక ఉత్పాతంలా వచ్చి నన్ను కొడుతుంది. కనీసం నన్ను నోరు తెరిచి మాట్లాడనివ్వలేదు. ఎందుకలా కొడుతోంది? ఆమెకేమైనా పిచ్చా? అనుకున్నా అని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles