Goa to ban drinking liquor in public places ప్రిన్స్ మహేష్ ‘స్పైడర్’ టీజర్ అదుర్స్.. రెస్పాన్స్..

Goa to ban drinking liquor in public places parrikar

Manohar Parrikar, liquor ban, Goa, beachs, public places, nuisance, amendments, excise act, goa daman and diu, two- wheelers, helmets, Goa riders

Goa Chief Manohar Parrikar today said that the state will ban drinking of liquor in public places to curb the nuisance created by people in drunken state.

గోవాలో ఇక మజా లేదు.. మద్యం కూడా లేదు..!

Posted: 09/18/2017 12:43 PM IST
Goa to ban drinking liquor in public places parrikar

గోవా పర్యటనకు వెళ్లున్నారంటేనే.. ఎంజాయ్ చేయడానికి అర్థం. అయితే ఇకపై మాత్రం మీకు గతంలో లభించిన ఎంజాయ్ మెంట్ లభించదు. ఎందుకంటారా.. ఇకపై గోవా రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని విధించనున్నారు. అదేంటి.. అత్యధిక అదాయాన్ని సమకూర్చుతున్న వనురుపైనే నిషేధాన్ని విధిస్తే.. ఇక గోవా ప్రగతి ఎలా సాధ్యమంటారా..? అయితే ఈ మధ్యపాన నిషేధం రాష్ట్రవ్యాప్తంగా కాదు. కేవలం బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే. అర్థంకాలేదా..?

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించటం.. ప్రజా జీవనానికి విఘాతం కలిగించేలా వ్యవహరించటం లాంటి కేసులు పెరిగిపోతున్న ఈ అంశంపై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఇకపై పబ్లిక్ ప్లేసెస్ లో మద్యపాన నిషేధాన్ని చేపట్టనుంది. ఈ మేరకు వచ్చే నెల (అక్టోబర్) లో నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు. ఇప్పటికే బీచుల్లో, పలు ఎంపిక చేసిన ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాన్ని విధించిన గోవా ప్రభుత్వం.. ఇకపై బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడంపై కూడా నిషేధాన్ని విధించనుంది.

ఈ మేరకు గోవా దామన్ అండ్ డియూ ఎక్సైజ్ చట్టంలో అవసరమైన మేరకు మార్పులను తీసుకురానున్నట్లు సీఎం తెలిపారు. కూడా క్రమంలో గోవా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఇకపై గోవాలో ఎవరైనా మద్యం తాగాలంటే లోపల తాగాలి కాని బహిరంగ స్థలాల్లో కాదని సీఎం మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. నిబంధనను ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తామని, మద్యం షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని సీఎం ప్రకటించారు. నిత్యం పర్యాటకులతో కళకళలాడే గోవా బీచ్‌లు, మద్యం దుకాణాలు తాజా ఉత్తర్వులతో వెలవెల పోనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : goa  liquor ban  beachs  manohar parrikar  public places  two wheelers  

Other Articles