ఐటీ అధికారులు దాడి చేస్తున్నారంటే ఎంతటి అక్రమార్కులకైనా ఒంట్లో భయం బయటకు తన్నుకోస్తుంది. ఇంట్లో వున్న అన్ని అస్తుల తాలుకూ డాక్యూమెంట్లతో పాటు నగలు, నట్రాలకు సంబంధించిన వివరాలను కూడా వారికి తెలియజెప్పాల్సిన అవసరం వుంటుంది. దీంతో ఎక్కడ తప్పులు చెప్పి.. వారి చేతిలో ఇరుక్కుపోతామోనన్న భయం అప్పడప్పుడు లెక్కలన్నీ సరిగ్గా చూపించేవారిలోనూ కనిపిస్తుంది.
ఇలాంటి దాడులు సర్వసాధారణంగా అక్రమంగా డబ్బులు మూటగట్టుకున్నాడన్న వార్తల నేపథ్యం అధికారులు కూపీ లాగి నిజమని తేలిన తరువాతే.. దాడులు చేస్తారు. కానీ ఓ వ్యాపారి ఇంట్లో మాత్రం రెండు పర్యాయాలు అదాయపన్ను శాఖ అధికారులమంటూ దాడులు నిర్వహించారు. అయితే రెండు పర్యాయాలు దాడి చేసింది మాత్రం నకిలీలే. నకిలీ వ్యక్తులే ఐటీ అధికారులమని చెప్పి దాడి చేయడంతో.. ఇరుగుపోరుగువారు వచ్చి వారికి దేహశుద్ది చేసి మరీ పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ ఢిల్లీలోని మాల్వియా నగర్ ఏరియాలో ఓ వ్యాపారి ఇంటికి క్రితం రోజున ఆరుగురు వ్యక్తులు వచ్చారు. ఇన్ కం ట్యాక్స్ అధికారులమని.. నమ్మబలికిన వ్యక్తులు ఇంట్లో సోదాలు చేయాలని చెప్పారు. నకిలీలు కావడంతో చకచకా లెక్కలు తేల్చి.. అంతా సక్రమంగానే వున్నా.. ఏదో కారణం చెప్పి.. వ్యాపారి నుంచి 20 లక్షలు లాగేసుకున్నారు. అప్పటికే విషయం తెలిసిన ఇరుగు పొరుగువారు అక్కడికి చేరుకుని వారిని పోలీసులకు అప్పగించే ముందు కాస్తా దేహశుద్ది చేశారు.
సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు వ్యాపారి ఇంటికి వచ్చిన నకిలీ అధికారుల విషయం ఇరుగుపోరుగు తెలిసిపోవడానికి కారణం ఏంటీ..? వారు అదాయపన్ను శాఖ అధికారులుకారని వారేలా పసిగట్టారు అంటారా..? అక్కడే వుంది అసలు ట్విస్టు.. గతంలోనూ ఈ వ్యాపారి ఇంటిపై అదాయపన్ను శాఖ అధికారులమని చెప్పి.. కొందరు నకిలీలు ఇలానే దోపిడి చేశారట. దీంతో కొద్దిరోజుల పాటు పోలీసు సెక్యూరిటీ కూడా పెట్టారు. పోలీసు భద్రత లేదని తెలుసుకున్న దొంగలు దోపిడీకి యత్నించడంతో.. ఇలా చిక్కారు.
అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే అటు నకిలీ అదాయపన్ను శాఖ అధికారులపై కేసులు బనాయించి, కటకటాలోకి నెట్టిన పోలీసులు ఇటు వ్యాపారిపై కూడా కేసు పెట్టే విషయమై యోచిస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నూతన అర్థిక బిల్లులో ఎవరైనా రెండు లక్షలకు మించి డబ్బును ఇంట్లో పెట్టుకుంటే వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా వుంటుందని స్పష్టం చేస్తుండడంతో అధికారులు కేసు విషయంలో తర్జనభర్జన పడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more