దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల మేరకు అనేక మలుపులు తిరిగిన సదావర్తి భూములకు బహిరంగ వేలం ప్రక్రియ ఇవాళ విజయవంతంగా ముగిసింది. చెన్నై టీనగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో సదావర్తి భూములు రూ.60.30 కోట్ల ధరకు సత్యనారాయణ బిల్డర్స్ సంస్థ దక్కించుకుంది. అత్యంత ఉత్కంఠకరంగా సాగిన ఈ వేలంలో మొత్తం ఎనమిది సంస్థలు పాల్గొనగా కడప వాసి సత్యనారాయణ రెడ్డి భూములను దక్కించుకున్నారు.
ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ పర్యవేక్షణలో నిర్వహించిన సదావర్తి భూముల వేలం ప్రక్రియలో.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల మేరకు వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ టెండర్ కమ్ సీల్డ్ కవర్ కమ్ బహిరంగ వేలం పద్ధతిన 83.11 ఎకరాల భూమికి వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్టాడుతూ.. తాను సదావర్తి భూముల కొనుగోలుకు సిద్దపడే వచ్చానని అన్నారు.
ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వేలంలో పాల్గొన్నాలని సిద్దపడి.. వచ్చానన్నారు. తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు. ప్రస్తుతం సగం ధరను చెల్లిస్తానని, మిగిలింది కూడా నిబందనల ప్రకారం చెల్లించేందుకు తాను సిద్దమని చెప్పారు. అయితే తమిళనాడు ప్రభుత్వం ఈ భూములు తమకే చెందాలని సుప్రీంకోర్టులో వేసిన కేసు గురించి తనకు తెలుసునని, తమకు భూములు లేదా చెల్లించిన డబ్బులు రెండింటిలో ఏదో ఒకటి తప్పక దక్కుతుందని చెప్పారు. కాగా వేలం పాట మరింత పెరిగిన పక్షంలో తాను పోటీ నుంచి తప్పుకునేవాడినని చెప్పారు. ప్రభుత్వంతో వ్యాపారం చేసినప్పుడు అంతా పారదర్శకంగా వుంటుందన్నారు.
సదావర్తి భూములను గతంలో విక్రయించిన టీడీపీ ప్రభుత్వం.. ఆ మొత్తంతో పోల్చుకుంటే.. తాజా వేలంతో సమకూరిన మొత్తం అత్యంత భారీగా ఉంది. మొత్తం 83 ఎకరాలా 11 గుంటల భూమిని ఏపీ ప్రభుత్వం 22 కోట్ల రూపాయల మొత్తానికే అమ్మేసింది. దీనికి అభ్యంతరం తెలిపిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వీటిని 27 కోట్లకు కొనుగోళ్లకు ముందుకొచ్చారు. అయితే భూములకు వేలం నిర్వహించాలని సుప్రీం అదేశించడంతో.. దాదాపు 38 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వ ఖజానాకు సమకూరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more