తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠకరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వరుసగా రెండో పర్యాయం గెలిచి, అనారోగ్యం బారినపడి మరణించిన తరువాత.. అధికార పార్టీలో అనేక చీలికలు వచ్చి.. రోజుకో మలుపు తిరుగుతూ.. శరవేగంగా మార్పులు సంతరించుకున్న అరవ రాజకీయాలు చివరకు మద్రాసు హైకోర్టు నిర్ణయం మేరకు అధారపడి వున్నాయి. పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాలు కలసిన తరువాత టీటీవీ దినకరన్ వర్గంగా విడిపోయిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటువేయడంతో చివరకు పంచాయితీ తమిళనాడు రాష్ట్రోన్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టుకు చేరింది.
టిటీవీ దినకరణ్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం సహజ సూత్రాలకు విరుద్దమని వారి తరపున ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబల్, దుష్యంత్ దవే వాదించారు. న్యాయస్థానంలో ఎమ్మెల్యేల తరపున తొలుత వాదనలు వినిపించిన ఆయన.. ‘18మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తు స్పీకర్ తీసుకున్న నిర్ణయం సహజ న్యాయానికి విరుద్థం. పార్టీకి విరుద్ధంగా ఎమ్మెల్యేలు ఏం చేయలేదు. వాళ్లు నాయకుడిని మాత్రమే మార్చాలని కోరారు. వారు వేరే పార్టీలోకి వెళ్లలేదు.. దీని ప్రకారం వారి చర్య పార్టీ ఫిరాయింపు పరిధిలోకి రాదని దవే వాదించారు.
గవర్నర్ కు వారిచ్చిన లేఖలో కూడా అవినీతిపరుడైన పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపాలనే కోరారన్నారు. ఆ పద్దెనిమంది ఎమ్మెల్యేలకు కనీసం సమయం కూడా ఇవ్వకుండా వెనువెంటనే చర్యలు తీసుకుంటూ.. మూడు వారాల్లో త్వరత్వరగా మొత్తం కానిచ్చి.. చివరికి వారిపై అనర్హత వేటు వేశారని దుష్యంత్ దవే ఆరోపించారు. ప్రభుత్వ తరుపు న్యాయవాది ఆర్యమన్ సుందరం. వాదనలు చేస్తూ స్పీకర్ నిర్ణయం సరైనదే అన్నారు. చట్టప్రకారమే ఆయన వ్యవహరించారని తెలిపారు.
కాగా దినకరణ్ వర్గం ఎమ్మెల్యేల అనర్హత విచారణపై స్టే ను విధించని న్యాయస్థానం.. ఈ విషయంలో తాము తీర్పు చెప్పేవరకు తమకు తెలియకుండా ఈ సీట్లు ఖాళీగా వున్నట్లు ప్రకటించడం.. లేదా ఆయా స్థానాలకు ఉప ఎన్నికలను ప్రకటించడం చేయరాదని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది.
ఇక పళనిస్వామి ప్రభుత్వానికి బలం లేదని ఆయన వెంటనే తన బలాన్ని నిరూపించుకోవాలని డీఎంకే పార్టీ సీనియర్ నేత స్టాలిన్ వేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం.. తాను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు బలపరీక్ష నిర్వహించవద్దని గతంతో తానిచ్చిన అదేశాలు అమల్లో వుంటాయని జస్టిస్ ఎం దురయ్ స్వామి అదేశాలను జారీ చేశారు. దీంతో అరవ రాజకీయాలపై ఉత్కంఠ వచ్చే నెల నాలుగు వరకు కొనసాగనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more