Bengaluru Police Find Out Walking Stick Gun వాకింగ్ స్టిక్ గన్.. నేరగాళ్ల తెలివికి.. పోలీసులు షాక్

Bengaluru police find out walking stick gun

Ranganath, Bengaluru, criminals, supari, professional killers, hired killers, Police, Walking Stick, Gun, double barrel riffle, viral video, bengaluru police, karnataka

Bangalore Police find out walking stick gun which can be used during emergency situations. The walking stick has a trigger and Two bullets can be loaded.

ITEMVIDEOS: వాకింగ్ స్టిక్ గన్.. నేరగాళ్ల తెలివికి.. పోలీసులు షాక్

Posted: 09/21/2017 06:08 PM IST
Bengaluru police find out walking stick gun

నేరగాళ్లు నేరాలు చేసి సునాయాసంగా ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకుని పారిపోవడానికి ప్రణాళికలు రచిస్తారు. అయితే వాటన్నింటినీ చివరకు పోలీసులు చేధిస్తారని తెలిసినా వారు నేరాలకు పాల్పడకుండా వుండరు. తాజాగా నేరప్రవృత్తిలో వారు ఎంతగా రాటు తేలిపోయారన్నది ఈ వీడియో బహిర్గతం చేస్తుంది. మరీ ముఖ్యంగా సుపారీ తీసుకునే ప్రోఫెషనల్ కిల్లర్లో, లేక హైయిర్డ్ కిల్లర్లో ఈ తరహా ప్రణాళికను సిద్దం చేసి వుంటారని అనుమానాలు వస్తున్నాయి. అసలు ఇంతకీ బెంగుళూరు పోలీసులకు దొరికిందేంటి..? అంటారా.?

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు పోలీసులకు ఓ చేతి కర్రపై అనుమానాలు వచ్చాయి. అయితే అది సాధారణంగా వృద్దులు వాడే చేతికర్ర కాదు. దీంతో దానిని పరిశీలించారు. అది చేతికర్ర (వాకింగ్ స్టిక్) అకారంలో రూపోందించిన సరికొత్త గన్. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాని విధంగా పూర్తిస్థాయి తుపాకీని చేతికర్రలా తయారు చేశారు. తొలుత ఇది మామూలు స్టిక్ అనుకున్న పోలీసులు అనుమానం వచ్చి పరిశీలించారు. వారి పరిశీలనలో అది సాధారణ వాకింగ్ స్టిక్ కాదని తేలిపోయింది. మరింత లోతుగా పరిశీలన చేశారు. అంతే అప్పుడు అర్థమైంది. అది చేతికర్ర కాదు గన్ అని.

వాకింగ్ స్టిక్ కింది భాగంలో ఒకేసారి రెండు తూటాలు పెట్టేందుకు స్పేస్ వుంది.. చేతితో పట్టుకునే స్టిక్ భాగాన్ని విప్పిచూడగా అందులో ట్రిగ్గర్ ఉండటంతో పోలీసులు షాక్ తిన్నారు. ఇక దానిని క్లోజ్ చేసిన తరువాత పోలీసులు దానిని ఎలా వాడతారో కూడా బుల్లెట్ లేకుండా పేల్చిచూపించారు. ఇది ఎక్కడ, ఎవరు తయారు చేశారన్న విషయం కానీ.. ఎవరు వినియోగించేందుకు తీసుకువచ్చారన్న విషయం కానీ తెలియదు. అయితే ఈ మేరకు పోలీసులు దర్యాప్తును మాత్రం చేస్తున్నారు.

walking-stick-gun

 

అసెంబ్లీ ఎన్నికల వేళ దీనిని కర్ణాటకలోకి తీసుకువచ్చిన వారు ఎవరు..? దీని వెనుకు వున్నది ఎవరు..? గ్యాంగ్ స్టర్లు తెప్పించారా లేక.. ప్రోఫెషనల్ కిల్లర్సా.? అన్నది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సివుంది. ఈ చేతికర్రను గుర్తించిన ప్రాంతం వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఇలాంటి అనుమానిత వస్తువులు కనిపిస్తే అప్రమత్తమై తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. ఇక దీనిని సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : criminals  Police  Walking Stick  Gun  double barrel riffle  viral video  bengaluru police  karnataka  

Other Articles