ACB raids town planning officers houses నిరోధక శాఖకు చిక్కిన ‘‘అవినీతి గాడ్జిల్లాలు’’

Acb raids town planning officers raghu shiva prasad housed

townplanning officers houses raided, townplanning director house raided, town planning officers raghy, shiva prasad, town planning department, raghu, shiva prasad, town planning officers, vishakapatnam, vijayawada, ACB, Andhra Pradesh, crime

ACB officials raided on houses of two Town Planning officers Siva Prasad and Raghu in Vijayawada and Visakhapatnam and their relatives houses, who unearthed valuable documents, gold, silver from their procession during the raids.

నిరోధక శాఖకు చిక్కిన ‘‘అవినీతి గాడ్జిల్లాలు’’

Posted: 09/25/2017 02:47 PM IST
Acb raids town planning officers raghu shiva prasad housed

నవ్యాంధ్ర రాష్ట్రంలో కలిసివస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న అక్రమార్కుడు ఏకంగా అవినీతి సామాజ్రాన్ని తలపించేలా వందల కోట్ల రూపాయలను గడించాడు. ఆంద్రప్రదేశ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న రఘు అక్రమాలపై అనేక రోజులుగా పిర్యాదులు అందుతుంటడంతో అయనపై పూర్తిగా నిఘా పెట్టిన కూపీలాగిన ఏసీబీ.. రఘు నివాసంతో పాటు ఆయన బంధువైన శివప్రసాద్ సహా మొత్తం 15 బృందాలుగా విడిపోయి.. రాష్ట్రాలు దాటిన మరీ సాగిన ఆయన అక్రమార్జన చిట్టాను పూర్తిగా గుట్టు విప్పుతున్నారు.

విశాఖపట్నం, విజయవాడ, గన్నవరం, చిత్తూరు,  షిర్డీ, హైదరాబాద్, బెంగళూరులోని ఆయనకు సంబంధించిన నివాసాలపై కూపీ లాగిన ఏసీబి అధికారులు ఏకకాలంలో అన్నింటిపై దాడి చేశారు. ఉదయం అరున్నర గంటల నుంచి ఆయన నివాసాలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో పాటు అయనకు సన్నిహితంగా మెలుగుతున్న వారితో పాటు సమీప బంధువుల నివాసాలపై కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ టెక్నికల్ ఇంజనీరుగా విదులు నిర్వహిస్తున్న నల్లూరి వెంకట శివప్రసాద్ ఆయనకు సమీప బంధువని తేలడంతో ఆయన నివాసంపై కూడా దాడులు నిర్వహించారు.

భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడి పెద్దమొత్తంలో అక్రమాస్తులు, డబ్బు సంపాదించారన్న ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు దాడులు చేయగా, ఇటు విజయవాడలోని నల్లూరి వెంటక శివప్రసాద్ నివాసంలో గుట్టల కోద్ది వెండి బంగారు అభరణాలతో పాటు కరెన్సీ కట్టలు, భూముల పత్రాలు లభ్యమైనట్లు కూడా పోలీసులు తెలిపారు. వాటిలో గన్నవరంలోని సుమారు 15 ఏకరాల భూమి పత్రాలు లభ్యమైనట్లు సమాచారం. అది కాకుండా ఇంకా అనేక ప్రాంతాల్లో భూములకు సంబంధించిన పత్రాలు కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

ఆయన నివాసంలోని తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు షాక్ అయ్యేలా..  మాసిన బట్టలు, వాషింగ్ మెషీన్ కింద, మంచం కింద, బీరువా పోరుగుల్లో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా బంగారు ఆభరణాలు దొరికాయి. బంగారు విగ్రహాలు కూడా లభ్యమయ్యాయి. వివిధ వస్తువులు, దిమ్మలు, బిస్కెట్ల రూపంలో 50 కేజీల వెండికి మించి లభించిందని అంచనా. అలాగే ఆయన నివాసంలో 10 లక్షల రూపాయల నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. వీటన్నింటిని లెక్కగడుతున్న అధికారులు ఇప్పటి వరకు అవినీతి జలగాల్ని చూశాం.. తిమింగళాలని చూశాం.. కానీ ఇదే తొలిసారి ఏకంగా అవినీతి గాడ్జిల్లాలను చూస్తున్నామని పేర్కోన్నట్లు సమాచారం.

 అలాగే గన్నవరం సమీపంలో 300 ఎకరాల వెంచర్ కు సంబంధించిన పత్రాలు కూడా దొరికాయన్న వార్తలు వెలువడుతున్నాయి. గన్నవరంలోని ప్రస్తుతం ఆయన నివాసం ముందే 40 సెంట్ల భూమి ఉన్నట్టు గుర్తించారు. అలాగే షిర్డీలో ఒక లాడ్జి, వేల్పూరులో రెండెకరాల వ్యవసాయ భూమి, విజయవాడలో 16 ఫ్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. అంతే కాకుండా డబ్బులు లెక్కించేందుకు ఆయన నివాసంలోనే మనీ కౌంటింగ్ మెషీన్ కూడా ఉండడం విశేషం. ఇవన్నీ చూసి కళ్లు చెదిరిన ఏసీబీ అధికారులు లెక్కింపు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghu  shiva prasad  town planning officers  vishakapatnam  vijayawada  ACB  crime  

Other Articles