దేశాన్ని పరిశుభ్రంగా వుంచితే అది దేశప్రజలను అనారోగ్యాలకు దూరంగా వుంచుతుందని భావించి.. స్వచ్ఛా భారత్ మిషన్ ను ఉద్యమంలా చేపడుతున్న కేంద్రప్రభుత్వం. ఈ ఉద్యమం మూడేళ్లను పూర్తి చేసుకుంటున్న క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని ప్రముఖులకు మరోమారు లేఖలు రాశారు. స్వఛ్ఛతాహీ సేవా కార్యక్రమంలో పాల్గోనాలని ఆయన పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గోనాలని పిలుపునిచ్చారు. ఆయన అలా చెప్పారో లేదో.. ఇలా అచరించి చూపుతున్నారు ప్రముఖులు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, 'స్వచ్ఛతా హీ సేవ'లో పాల్గొనాలని ఆయన అదే జాతిపితకు మనం అర్పించే ఘనమైన నివాళి అని ప్రధాని పిలుపునిచ్చారో లేదో.. ఏకంగా దేవుడు కూడా చీపురు పట్టాడు. అదేంటి అంటారా.. భారత బ్యాటింగ్ దిగ్గజం, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చీపురు పట్టి.. అపరిశుభ్రతతో వున్న పరిసరాలను శుభ్రంగా మార్చేశారు. సెలబ్రిటీ కావడంతో అభిమానుల గోల ఎదురవుతుందని భావించిన సచిన్ వేకువ జామునే నిద్రలేచి దేశ అర్థిక రాజధాని ముంబైలోని బంద్రాలో స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో పాల్గోన్నారు.
We each have to do our bit to keep #IndiaClean. So, pick a group of friends, a street, and together let’s #CleanUp India. #SwachhataHiSeva pic.twitter.com/k8Z7o8Faca
— sachin tendulkar (@sachin_rt) September 26, 2017
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, చుట్టూ ఉన్న ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. మోదీ చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతున్నట్టు తెలిపారు. కాగా, స్వచ్ఛ భారత్ సాధనలో భాగంగా 'స్వచ్ఛతా హీ సేవా'ను చేపట్టామని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మోదీ కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన పలువురు సెలబ్రిటీలకు ఇప్పటికే లేఖలు కూడా రాశారు. దక్షిణాదిలో మోహన్ లాల్, రజనీకాంత్, రాజమౌళి తదితరులకు మోదీ లేఖలు రాయగా, వారంతా తమవంతు సహకారాన్ని అందిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అటు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, అనుష్కా శర్మ తదితరులు కూడా మోదీ ఆలోచనలో పాలు పంచుకునేందుకు అంగీకారాన్ని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more