Honeypreet surrenders to Punjab Police.. డేరా దత్తపుత్రిక హనీప్రీత్ సరెండరా..? లేక అరెస్టా..?

Ram rahim s adopted daughter honeypreet surrender or was she arrested

Honeypreet surrender, Honeypreet Insan surrender, Honeypreet arrested, Honeypreet Insan arrested, honeypreet insan, Punjab Police, Haryana police, Dera Sacha Sauda, Gurmeet Ram Rahim Singh, latest news

Honeypreet Insan, the "adopted daughter" of Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh, was arrested by Punjab Police, but some other reports, however, claimed that she had surrendered to the police.

డేరా దత్తపుత్రిక హనీప్రీత్ సరెండరా..? లేక అరెస్టా..?

Posted: 10/03/2017 03:34 PM IST
Ram rahim s adopted daughter honeypreet surrender or was she arrested

డేరా సచ్ఛా సౌధా అధినేత, తన వద్ద సేవ చేసేందుకు వచ్చిన సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో అభియోగాలను ఎదుర్కొని దోషులుగా నిరూపితమై జైలు జీవితం గడుపుతున్న.. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రికగా పేర్కోంటున్న హనీప్రీత్ ఇసాన్ పోలీసుల అదుపులో వున్నారు. అమెను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన హర్యానా రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. పంజాబ్ లోని ప‌టియాల‌-జిరాక్ పూర్ జాతీయ ర‌హ‌దారిపై హ‌నీప్రీత్ ను అదుపులోకి తీసుకున్న‌ట్లు పంజాబ్ పోలీసులు చెప్పారు.

అయితే హనీప్రీత్ పై హర్యానా కోర్టులో కేసులు నమోదైన నేపథ్యంలో అమెను హ‌ర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీప్రీత్ ను బుధవారం కోర్టులో హాజ‌రుప‌ర్చుతామ‌ని హర్యానా పోలీసులు తెలిపారు. డేరా బాబాకు జైలు శిక్ష ఖారారైన నాటి నుంచి దాదాపు 36 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న హ‌నీప్రీత్ పై కేసు న‌మోదైంది. అయితే అమెను తమ ఎదుట ప్రవేశపెట్టాలని న్యాయస్థానం సమన్లు కూడా జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో హనీప్రీత్ అదృశ్యమయ్యింది. నేపాల్ నుంచి విదేశాలకు పారిపోయిందని వదంతులు కూడా వచ్చాయి.

అయితే నేపాల్ లో అన్వేషించిన పోలీసులు డేరాబాబా డ్రైవర్ ను అదుపులోకి తీసుకోవడంతో ఈ వదంతులకు బలాన్నిచ్చింది. కాగా ఇటీవలే అమె తన న్యాయవాదితో కలసి ఢిల్లీ హైకోర్టులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అర్ధిస్తూ పిటీషన్ దాఖలు చేయడంతో.. పోలీసులు అప్రమత్తమై ఢిల్లీలో అమె కోసం గాలించారు. అమెకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పిన న్యాయస్థానం అమెను ముందగా పోలీసులకు లొంగిపోవాలని అదేశించింది. దీంతో గత వారం రోజులుగా తప్పించుకు తిరిగిన  ఆమెను ఇవాళ ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అమె తానే స్వతహాగా పోలీసులకు లోంగిపోయినట్లు కూడా పలు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Honeypreet  surrender  arrest  punjab police  haryana police  gurmeet ram rahim singh  

Other Articles