జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ తన పేరును మార్చకున్నారా..? ఇప్పుడీ ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసేసందుకు రెడీ అంటూ ప్రకటించారా..? అంటే అవునన్న సంకేతాలు వినబడుతున్నాయి. ఇటు తెలంగాణలోనూ తమ బలం, ప్రాబల్యం వున్న ప్రతీ చోట ఎన్నికల బరిలోకి దిగుతామని పవన్ కల్యాన్ ప్రకటించారా..? అంటే మిశ్రమ జవాబులే వినబడుతున్నాయి. అదేంటి అంటే.. ఇందుకు కూడా కారణాలు లేకపోలేదు. అయితే ఇప్పుడీ ప్రశ్నలు మాత్రం తెలుగురాష్ట్రాలలో చర్చనీయాంశాలుగా మారాయి.
పేరు విషయానికి వస్తే.. కొణిదల కల్యాన్ బాబు.. పేరును ఆయన పవన్ కల్యాన్ గా తన స్ర్కీన్ నేమ్ మార్చుకున్నారు. దీంతో అభిమానులు పీకే అంటూ ముద్దుగా కూడా పిలుచుకుంటారు. అయితే ఆయన పేరు మార్చకున్నారన్న టాక్ అభిమానుల్లో సంచలనంగా మారింది. అయితే అది నిజమేనన్నట్లుగా ఆయన పేరును పవన్ కల్యాన్ అని సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ లో టైప్ చేయగానే పవర్ స్టార్ ఫొటోలు వస్తున్నాయి.. అంతా ఓకే కదా.. మరి అలాంటప్పుడు పేరు మారిందని ఎలా అంటారు అనేగా మీ డౌట్..?
ఫొటోలు పవన్ కల్యాన్ వే కానీ వాటి కింద పేరు మాత్రం పవన్ కల్యాన్ అనే లేక కొణిదల కల్యాన్ బాబు అనే వుండాల్సింది పోయి.. ఏకంగా కుషాల్ బాబు అని వస్తోంది. ఇది కేవలం పవన్ కల్యాన్ అనేు కాదు పవర్ స్టార్ అని టైమ్ చేసినా జనసేన అధినేత ఫొటోలే స్రీన్ పై వస్తున్నా.. కిందమాత్రం కుషాల్ బాబు అన్న పేరు వస్తుంది. దీంతో జనసేన అధినేత ఫ్యాన్స్, అభిమానులు కన్ఫ్యూజన్ రైజ్ అయ్యి హాట్ టాఫిక్ గా మారింది. దీనినే అభిమానులు కూడా షేర్ చేసుకోవడంతో అది కాస్తా సోషల్ మీడియా వైరల్ అయ్యింది.
ఈ విషయాన్ని గుర్తించి జనసేన పార్టీ ఆఫీస్ ఇప్పుడు గూగుల్ సిబ్బందితో మాట్లాడుతోంది. పవన్ కల్యాణ్ పేరు కుషాల్ బాబుగా తీసుకోవటాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. సెర్చ్ ఇంజిన్ లో ఇలా జరగటం కొత్తేమీ కాదు. గతంలోనూ లోకేష్ బాబు అని టైప్ చేస్తే.. పప్పు (దాల్) అని వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని పక్కన బెడితే జనసేన అధినేత అంధ్రప్రదేశ్ లోని 175 స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు వార్తలు ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వెనువెంటనే దానిని తొలగించారు. పవన్ సునామీ లాంటి అభిమానులకు చేరిన ఈ విషయాన్ని వారు మాత్రం తమ స్నేహితులతో షేర్ చేసుకుంటున్నారు. ఇటు తెలంగాణలో కూడా తాము ఎన్నికల బరిలో నిలుస్తామని ట్విట్ సందేశమిచ్చింది. మరి ఈ ట్విట్ ను జనసేన వర్గాలు వెనువెంటనే తొలగించడంపై కారణమేంటో వారికే తెలియాలి. ఈ విషయంపై వారు ఏం వివరణ ఇవ్వనున్నారన్న అసక్తి అటు అభిమానులు, ఇటు పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా రేకెత్తుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more